Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anakapalli Producer Naidu: సినిమా పిచ్చి ఉండటం వేరు.. అదే సినిమాను శ్వాసగా మార్చుకుని కలలను నిజం చేసుకోవడం వేరు. సరిగ్గా ఇదే బాటలో నడిచి నేడు ఎందరో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ‘అనకాపల్లి’ చిత్ర సహ నిర్మాత నాయుడు. కేవలం ఒక సామాన్య సినీ అభిమానిగా మొదలైన ఆయన జీవిత ప్రయాణం.. నేడు థియేటర్ అధినేతగా, చిత్ర నిర్మాతగా ఎదిగిన తీరు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే రా అండ్ రస్టిక్ చిత్రాలకు టాలీవుడ్లో తిరుగులేని ఆదరణ లభిస్తోంది. ఇదే తరహాలో పక్కా విలేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘అనకాపల్లి’. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించి కీలక పాత్రలో నటిస్తూ నిర్మించిన ఈ చిత్రానికి నిర్మాత నాయుడు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్ర ప్రమోషన్ల సందర్భంగా నిర్మాత నాయుడు తన గతాన్ని గుర్తుచేసుకుంటూ పంచుకున్న మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. ‘‘నేను రెబల్ స్టార్ ప్రభాస్ గారికి వీరాభిమానిని. ప్రభాస్ ‘మిర్చి’ సినిమా విడుదలయ్యే సమయానికి నేను ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని ఒక సాధారణ వ్యక్తిని. ఆ టైంలో అనకాపల్లిలో సినిమాకు వెళ్తే టికెట్ ఇవ్వలేదు. ఏదో ఒకరోజు కచ్చితంగా ఆ థియేటర్ కొనుక్కోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆ టైంలో జీవితంలో ఏదో సాధించాలన్న బలమైన సంకల్పం, లక్ష్యంతో అడుగులు ముందుకు వేశాను. కష్టపడి పైకొచ్చి థియేటర్ ఓనర్‌గా మారాను. ఇప్పుడు నేను నిర్మించిన సినిమాను నా సొంత థియేటర్లోనే ప్రదర్శించుకుంటున్నాను’’ అంటూ ఆయన చెప్పిన మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
ఒకప్పుడు టికెట్ కోసం క్యూలైన్లలో నిలబడ్డ సామాన్య అభిమాని.. క్రమంగా ఎగ్జిబిటర్‌గా మారి థియేటర్ల యజమాని కావడం, ఆపై సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి సినిమాను నిర్మించి తన సొంత థియేటర్లో ప్రదర్శించుకోవడం నిజంగా అద్భుతమైన విజయం. కలలను నిజం చేసుకోవడానికి కష్టపడే తత్వానికి మించిన పెట్టుబడి మరొకటి లేదని నిర్మాత నాయుడు ప్రయాణం నిరూపిస్తోంది. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ‘అనకాపల్లి’ చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. పక్కా స్థానికతతో, రస్టిక్ యాక్షన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాలని కోరుకుంటూనే.. ఈ స్థాయికి చేరుకున్న నిర్మాత నాయుడు సంకల్పాన్ని పలువురు సినీ ప్రియులు అభినందిస్తున్నారు.
తాజావార్తలు
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!