Tribanadhari Barbarik: ‘అనగా అనగా కథలా’ అంటున్న ‘త్రిబాణధారి బార్భరిక్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సత్య రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం ‘త్రిబాణధారి బార్భరిక్’ నుంచి ఒక హృదయస్పర్శి పాట విడుదలైంది. ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పణలో, విజయపాల్ రెడ్డి అడిదల నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పాటలు, గ్లింప్స్, టీజర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా, ‘అనగా అనగా కథలా’ అనే ఫీల్-గుడ్ పాటను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ పాటను టీకేఆర్ కాలేజీలో విద్యార్థుల సమక్షంలో బుధవారం రోజున కాలేజ్ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి విడుదల చేశారు. కార్తిక్ ఈ పాటను ఆలపించగా, ఇంఫ్యూజన్ బ్యాండ్ అందించిన సంగీతం ఆహ్లాదకరంగా ఉంది. సనరే రచించిన సాహిత్యం తాతయ్య మరియు మనవరాలి మధ్య అనుబంధాన్ని, ఆ భావోద్వేగాన్ని సునిశితంగా వ్యక్తీకరిస్తుంది.
పాట విడుదల కార్యక్రమంలో సత్య రాజ్ మాట్లాడుతూ, “టీకేఆర్ కాలేజీలో విద్యార్థుల ఉత్సాహం, శక్తి చూస్తుంటే సంతోషంగా ఉంది. దాదాపు 14 వేల మంది విద్యార్థుల మధ్య ఈ పాటను విడుదల చేయడం ఆనందదాయకం. పాటను రిలీజ్ చేసిన తీగల కృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి సహకరించిన హరనాథ్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి గార్లకు కృతజ్ఞతలు. ‘త్రిబాణధారి బార్భరిక్’ నుంచి ‘అనగా అనగా కథలా’ పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అందరూ చూసి ఆదరించాలి” అని అన్నారు. ఈ పాట విడుదలతో ‘త్రిబాణధారి బార్భరిక్’పై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా త్వరలో విడుదల కానుంది.
Also Read
- Tags
తాజావార్తలు
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
-
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
-
Yash : యష్ రిస్క్ చేస్తున్నాడా? బయట పడలేకపోతున్నాడా?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!