Site icon NTV Telugu

Shocking : ఓవర్సీస్ ‘OG’ డిస్ట్రిబ్యూటర్ సంఘ విద్రోహి.. మా థియేటర్స్ లో ‘OG’ రిలీజ్ చేయడం లేదు

Og

Og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ యక్ష్ణన్ చిత్రం OG. భారీ హైప్ తో భారీ ఎత్తున ఈ నెల న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఓవర్సీస్ లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ థియేటర్స్ చైన్ అయినటువంటి యార్క్ సినిమా OG సినిమాను తమ థియేటర్స్ లో రిలీజ్ చేయడం లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ‘ ప్రేక్షకులకు  ”ఓజీ” సినిమా యొక్క రాబోయే అన్ని షోస్ ను రద్దు చేయాలనే కఠినమైన నిర్ణయం యార్క్ సినిమాస్ తీసుకుందని మీకు తెలియజేయడానికి మేము చింతిస్తున్నాము. ఉత్తర అమెరికాలో ఈ సినిమా పంపిణీదారుల విషయంలో కల్చరల్, రాజకీయ శక్తులుకు సంబంధం ఉంది. కాబట్టి ప్రేక్షకుల సురక్షితం, సెక్యూరిటీ విషయంలో యార్క్ సినిమాస్ ఆందోళన చెందుతోంది. అందుకారణంగా OG సినిమా షోలను క్యాన్సిల్ చేశాం. ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నామని తెలియజేస్తున్నాం. సినీ ప్రేక్షకులకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. ముందుగానే టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికీ  పూర్తిగా తిరిగి  చెల్లిస్తాము. మాకు మా ఉద్యోగులు మరియు ప్రజల భద్రత మా ప్రధాన ప్రాధాన్యత.

Also Read : Tollywood : ఓవర్సీస్ కంటెంట్ డెలివరి చేయలేక చేతులెత్తేసిన ‘స్టార్’ సినిమా మేకర్స్

నార్త్ అమెరికాలో OG సినిమాకు వచ్చే కలెక్షన్స్ ను పెంచి చెప్పాలని, అలా చేస్తే నార్త్ అమెరికాలో రిలీజ్ కాబోయే తర్వాతి బిగ్ బడ్జెట్ సినిమాలు వాల్యూ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని  డిస్ట్రిబ్యూటర్ తరఫు వ్యక్తులు యార్క్ సినిమాస్ నుంచి కొన్ని రిక్వెస్టులు వచ్చాయి. నార్త్ అమెరికాలో సౌత్ ఏషియా ఫిల్మ్ ఇండస్ట్రీ నియంత్రణ చేసేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటారు. ఈ వ్యక్తులు సామాజిక స్థితి మరియు రాజకీయ సంబంధాల ఆధారంగా దక్షిణాసియాలో సాంస్కృతిక విభజనను సృష్టిస్తున్నట్లు కూడా కనిపిస్తోంది. అటువంటి అనైతిక వ్యాపార పద్ధతులు, విధానాలను యార్క్ సినిమాస్ ఒప్పుకోదు.  సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో అందరు అభివృద్ధి చెందడానికి మద్దతు ఇస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది. దక్షిణాసియా చిత్రాలకు సంబంధించి యార్క్ సినిమా యొక్క ఆర్డక వ్యాహారాలు, బాధ్యతలకు సంబంధించి వివరాలను పంపిణీదారులు లేదా వారికి చెందిన వారు భారతదేశంలోని కొన్ని ఆన్‌లైన్ మీడియాకు తప్పుడు ప్రకటనలు చేశారు. యార్క్ సినిమాస్ అటువంటి ప్రకటనల ఖచ్చితత్వాన్ని నిస్సందేహంగా ఖండిస్తుంది మరియు తప్పుడు సమాచారాన్ని అందించడానికి బాధ్యత వహించే వారిపై తగిన చర్యలు తీసుకుంటుంది’ అని పేర్కొంది. ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ సినీవర్గాల్లో తీవ్ర చర్చనియాంశం అయింది.

Exit mobile version