Site icon NTV Telugu

Amitabh Bachchan: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు రావోద్దని ఫ్యాన్స్‌ వార్నింగ్‌.. అమితాబ్‌ రియాక్షన్‌ చూశారా!

Amitabh Bachchan

Amitabh Bachchan

నిన్నటి నుంచి బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌కు నెటిజన్ల నుంచి విన్నపాలు, వార్నింగ్‌లు వస్తున్న సంగతి తెలిసిందే. ప్లీజ్‌ మీరు వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు రాకండి అంటూ కొందరు రిక్వెస్ట్‌ చేస్తుంటే.. మీరు ఇంట్లో కూడా మ్యాచ్‌ చూడొద్దంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇస్తున్నారు. దీనికి కారణం అమితాబ్‌ పెట్టిన పోస్టే. బుధవారం (November 15) భారత్‌-న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌ అనంతరం బిగ్‌ బి ఎక్స్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు. ‘నేను చూడనప్పుడే మనం గెలుస్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో వెంటనే ఓ నెటిజన్‌ ‘ప్లీజ్‌ అమితాబ్‌ సార్‌ ఈసారి మీరు వరల్డ్‌ కప్‌ చూసేందుకు రాకండి’ అని స్పందించారు.

Also Read: OTT: ఈ ఒక్క రోజే ఓటీటీకి 25 సినిమాలు.. రీసెంట్‌ హిట్‌ మూవీ కూడా వచ్చేసింది..!

అంతేకాదు మరికొందరు కూడా ‘మీరు ఇంట్లో కూడా మ్యాచ్‌ చూడకండి.. ఆ రోజు మీరు ఏదైన పనిలో బిజీ అయిపోండి’ అంటూ రిక్వెస్ట్‌లు చేశారు. ఇక ఫ్యాన్స్‌ నుంచి వస్తున్న రెస్పాన్స్‌ చూసి అమితాబ్‌ తాజాగా స్పందించారు. ‘ఇప్పుడు నిజంగానే మ్యాచ్‌ చూడాలా? వద్దా? అని ఆలోచిస్తున్నా’ అంటూ తాజాగా ఎక్స్‌లో మరో పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఆయన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు బీసీసీఐ అమితాబ్‌కు గోల్డెన్‌ టికెట్‌ అందించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఆయన ఎలాంటి టికెట్‌ కోనుగోలు చేయకుండానే వీఐపీ బాక్స్‌లో కూర్చోని ప్ర‌త్య‌క్షంగా అన్ని మ్యాచ్‌లు చూడోచ్చు.

Also Read: Mega 156: చిరంజీవి 156 సినిమా.. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌

ఈ అవకాశం అమితాబ్‌కు మాత్రమే కాదు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌లకు కూడా బీసీసీఐ ఈ గోల్డెన్ టికెట్‌ను అందించింది. కాగా ఆదివారం (నవంబర్‌ 19) వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ వరల్డ్‌ కప్‌ భారత్‌ వరస విజయాలతోవిజృంభిస్తూ.. ఫైనల్‌కు చేరుకుంది. ఇక కప్‌ను ముద్దాడేందుకు మరో అడుగు దూరంలో ఉంది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Exit mobile version