Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్యలో తన రియల్ ఎస్టేట్ పెట్టుబడులను వరుసగా విస్తరిస్తున్నారు. గత కొన్నేళ్లలో ఆయన రామనగరిలో రూ.100 కోట్లకు పైగా విలువైన భూములను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అయోధ్యలో అత్యధిక స్థాయిలో పెట్టుబడులు పెట్టిన ప్రముఖ సినీ సెలబ్రిటీల్లో అమితాబ్ బచ్చన్ అగ్రస్థానంలో నిలిచారు. హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. 2026 మార్చిలో ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL)’ నుంచి అమితాబ్ బచ్చన్ 2.67 ఎకరాల భూమిని రూ.35 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ స్థలం HoABL అభివృద్ధి చేస్తున్న 75 ఎకరాల విలాసవంతమైన ‘ది సరియు’ ప్రాజెక్ట్‌కు సమీపంలో ఉంది. ఇదే డెవలపర్‌తో ఆయన చేసిన మూడో ప్రధాన ఇన్వెస్ట్మెంట్గా పేర్కొంటున్నారు.
అంతకుముందు 2025 మే నెలలో ‘ది సరియు’ ప్రాజెక్ట్‌కు ఆనుకుని ఉన్న 25,000 చదరపు అడుగుల ప్లాట్‌ను సుమారు రూ.40 కోట్లకు అమితాబ్ సొంతం చేసుకున్నారు. అలాగే 2025 మార్చిలో రామ మందిరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న 54,454 చదరపు అడుగుల భూమిని ‘హరివంశ్ రాయ్ బచ్చన్ ట్రస్ట్’ పేరిట కొనుగోలు చేశారు. ఈ స్థలంలో తన తండ్రి, ప్రముఖ కవి డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్ స్మారకార్థం ఓ భారీ స్మారక నిర్మాణాన్ని చేపట్టే ఆలోచనలో బిగ్ బీ ఉన్నట్లు సమాచారం. ఇక 2024లో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు కూడా అమితాబ్ బచ్చన్ అయోధ్యలో వరుస పెట్టుబడులు పెట్టారు. HoABL అభివృద్ధి చేస్తున్న ‘ది సరియు’ ప్రాజెక్ట్‌లోని 10,000 చదరపు అడుగుల ప్లాట్‌ను రూ.14.5 కోట్లకు కొనుగోలు చేశారు. అదే ఏడాది జనవరిలో రామ మందిర ప్రారంభోత్సవానికి కొద్ది రోజుల ముందు ‘హవేలీ అవధ్’ ప్రాజెక్ట్‌లో 5,372 చదరపు అడుగుల ప్లాట్‌ను రూ.4.54 కోట్లకు సొంతం చేసుకున్నారు. అయోధ్యలో ఆయన చేసిన తొలి రియల్ ఎస్టేట్ పెట్టుబడి ఇదే. వరుసగా భూములు కొనుగోలు చేస్తూ అయోధ్యలో తన పెట్టుబడులను పెంచుకుంటున్న అమితాబ్ బచ్చన్, రామనగరి రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై తన విశ్వాసాన్ని మరోసారి చాటుకున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
-
Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
-
Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్‌ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
-
Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
-
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!