Salman Khan: సల్మాన్ ఖాన్‌కు హత్యా బెదిరింపులు.. హై ఎండ్ బుల్లెట్ ఫ్రూఫ్ ఎస్‌యూవీ కొనుగోలు..ప్రత్యేకతలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan bullet proof Car: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కు గత కొన్ని రోజులుగా హత్యా బెదిరింపులు ఎదురవుతున్నాయి. గ్యాంగ్ స్టర్లు ఆయన్ను చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఈమెయిల్స్ లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఆయనకు ముంబై పోలీసులు మరింత భద్రత కల్పించారు. ఇదిలా ఉంటే ఇలాంటి బెదిరింపుల మధ్య తన భద్రత కోసం హై ఎండ్ బుల్లెట్ ఫ్రూవ్ ఎస్‌యూవీ కారును కొనుగోలు చేశారు.
‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సల్మాన్ ఖాన్ తన భద్రత కోసం నిస్సాన్ పెట్రోల్ కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ కారు భారత మార్కెట్ లో అందుబాటులో లేదు. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కార్ అధికారికంగా ఇండియాలో లాంచ్ కాలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ కారును సల్మాన్ ఖాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read
Read Also: Amritpal Singh: భింద్రన్‌వాలేగా కనిపించేందుకు సర్జరీ.. అమృత్‌పాల్ సింగ్ కేసులో సంచలన విషయాలు
ఈ నిస్సాన్ కారుకు దక్షిణాసియా మార్కెట్లో విపరీతమైన ప్రజాదరణ ఉంది. అత్యంత ఖరీదు కలిగిన ఈ కారు, భద్రతా పరంగా చాలా ఫీచర్లను కలిగి ఉంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కొత్త సినిమా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీలో తెలుగు స్టార్ వెంకటేష్ కూడా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 21, 2023న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత దీపావళికి టైగర్ 3ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
కారు ప్రత్యేకతలివే..
ఈ కారు పూర్తిగా బుల్లెట్ ఫ్రూఫ్ గా ఉంటుంది. దీని విండ్ షీల్డ్, డోర్ గ్లాసులు చాలా మందంగా ఉంటాయి. ఈ కార్ 405 హార్స్ పవర్, 560 ఎన్ఎం టార్క్ కలిగి ఉంటుంది. 5.6 లీటర్ వీ8 ఇంజన్ కలిగి ఉంటుంది. 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో ఉంటుంది. బుల్లెట్ ఫ్రూవ్ కాకుండానే ఈ కారు ధర సుమారుగా రూ. 2 కోట్ల వరకు ఉంటుంది.
ప్రస్తుతం సల్మాన్ కార్ వద్ద టయోటా ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ఫ్రూవ్ కారు ఉంది. దీంతో పాటు మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, లక్సస్ ఎల్ఎక్స్ 470, ఆడి ఏ8, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆడీ ఆర్ఎస్7, మెర్సిడెస్ ఎఎంజీ జీఎల్ఈ 63 ఎస్ కార్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..