alman Khan bullet proof Car: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కు గత కొన్ని రోజులుగా హత్యా బెదిరింపులు ఎదురవుతున్నాయి. గ్యాంగ్ స్టర్లు ఆయన్ను చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఈమెయిల్స్ లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఆయనకు ముంబై పోలీసులు మరింత భద్రత కల్పించారు. ఇదిలా ఉంటే ఇలాంటి బెదిరింపుల మధ్య తన భద్రత కోసం హై ఎండ్ బుల్లెట్ ఫ్రూవ్ ఎస్‌యూవీ కారును కొనుగోలు చేశారు.