Site icon NTV Telugu

Ameesha Patel : పెళ్లయ్యాక అలా చేయమంటున్నారు.. షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చిన పవన్ బ్యూటీ

Maishapatel

Maishapatel

టాలీవుడ్ టూ బాలీవుడ్ చిత్రంలో తన ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి అమీషా పటేల్. ఎన్టీఆర్ తో నరసింహుడు, పవన్ కళ్యాణ్ తో బద్రి, బాలకృష్ణ తో పరమ వీరచక్ర, మహేష్ బాబు తో నాని వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో నటించడం తగ్గిపోయింది కానీ, బాలీవుడ్‌లో గదర్-2తో రీ-ఎంట్రీ ఇచ్చి సినిమాల్లోకి తిరిగి వచ్చారు. అయితే 50 ఏళ్ల వయసు అయినప్పటికీ ఈ బ్యూటీ సింగిల్ గానే ఉండిపోయింది. తాజాగా ఈ విషయంపై అమీషా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..

Also Read : Kantara Chapter 1: సెట్‌లోనే 4 సార్లు చనిపోయేవాడిని.. ప్రాణాపాయం మధ్య కాంతారా పూర్తి చేశా : రిషబ్ శెట్టీ

“నేను పెళ్లికి వ్యతిరేకిని కాదు. చాలా సార్లు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాను. కానీ నన్ను పెళ్లయ్యాక మారమని అడిగే వారు నాకు వద్దు. నా ప్రొఫెషన్‌ను వారి కోసం మార్చుకోవడం నాకు నచ్చదు. అందుకే పెళ్లి తర్వాత నా ఆలోచనలు గౌరవించే వ్యక్తిని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను” అన్నారు. ‘గతంలో ఒక వ్యక్తిని ప్రేమించినప్పటికీ అతను కూడా “సినిమాలు మానేయాలి” అని చెప్పడంతో ఆ సంబంధానికి బ్రేకప్ చెప్పాను. పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగడంలో నేను ఆగలేదు” అని చెప్పారు. అంటే వ్యక్తిగత జీవితం కంటే ప్రోఫేషనలే ముఖ్యం అని క్లియర్ గా తెలుస్తుంది. కానీ ప్రజంట్ ఇండస్ట్రీలో పెళ్లికి ప్రొఫేషనల్ తో సంబంధం లేకుండా పోయింది. స్టార్ హీరోలు హీరోయిన్లు సైతం వివాహ బంధంలో అడుగుపెడుతూ.. వరుస ప్రాజెక్ట్ లో బిజీగా గడుపుతున్నారు.

Exit mobile version