Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay-Trisha: తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష వ్యక్తిగత బంధంపై గత కొంతకాలంగా నెట్టింట రకరకాల రూమర్లు చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై తమిళ చిత్రసీమతో పాటు సోషల్ మీడియా వేదికగా నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా సీనియర్ హీరోయిన్ అంబిక చేసిన కామెంట్స్ సినీ వర్గాలతో పాటు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. త్రిష ప్లేస్‌లో తాను ఉంటే ఏం చేసేదాన్నో స్పష్టంగా చెబుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో విజయ్ – త్రిషల గురించి వస్తున్న రూమర్స్‌పై ప్రశ్నించగా, ఆమె ఏమాత్రం దాపరికం లేకుండా సూటిగా స్పందించారు.
“నేనే గనుక త్రిష స్థానంలో ఉండి ఉంటే.. కచ్చితంగా విజయ్‌కు దూరంగా ఉండేదాన్ని. మన వల్ల ఎదుటివారికి, ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని స్పష్టంగా తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్నేహం అనేది ఎంత విలువైనదైనా సరే.. దానికి కూడా కొన్ని హద్దులు, పరిమితులు పాటించాల్సిన అవసరం కచ్చితంగా ఉంది” అంటూ అంబిక తేల్చి చెప్పారు. అంబిక చేసిన ఈ కామెంట్స్ నేరుగా త్రిష ప్రవర్తనను వేలెత్తి చూపేలా ఉన్నాయంటూ కోలీవుడ్ సర్కిల్స్‌లో సరికొత్త చర్చ మొదలైంది. సినీ పరిశ్రమలో ఎంతటి సన్నిహిత స్నేహాలు ఉన్నప్పటికీ, బయట వస్తున్న ప్రచారాలు, వారి కుటుంబాలపై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అంబిక పరోక్షంగా హితవు పలికినట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మన ప్రవర్తన వల్ల ఇతరుల జీవితాలు ఇబ్బందుల్లో పడకూడదన్న ఆమె మాటలు త్రిషను ఉద్దేశించే చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాల్లో త్రిష – విజయ్ జోడీకి ఎంతటి క్రేజ్ ఉందో, వారి వ్యక్తిగత జీవితంపై వచ్చే గాసిప్స్ కూడా అంతే స్థాయిలో వివాదాస్పదమవుతున్నాయి. ఇలాంటి టైంలో సీనియర్ హీరోయిన్ అంబిక చేసిన కామెంట్స్ అటు విజయ్, ఇటు త్రిష అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరి అంబిక చేసిన ఈ బోల్డ్ కామెంట్స్‌పై త్రిష – విజయ్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Also Read
- Sharanya: 'లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి' ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన 'హనుమాన్ అన్ష్'!
- Ee Pata Korina Varu: 'నీ రేడియో కావాలి.. నేను వద్దా?' కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న 'ఈ పాట కోరినవారు..' టీజర్!
తాజావార్తలు
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!