NTV Telugu Site icon

Amala Akkineni : మీ నేతలను అదుపులో ఉంచుకోండి రాహుల్ గాంధీ: అమల

Amala Akhil

Amala Akhil

సమంత నాగ చైతన్య విడాకులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. సాటి మహిళపై కించిత్ గౌరవం లేకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు తమ ఇష్టానుసారం మాట్లాడడం ఏమాత్రం సమ్మతించదగిన విషయం కాదు. కాగా  తమ కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున  భార్య  అక్కినేని అమల  స్పందించారు.

Also Read : Naga Chaitanya : కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య ఏమన్నారంటే..?

అమల అక్కినేని మాట్లాడుతూ “ఒక మహిళా మంత్రి అయి ఉండి ఇంకొక మహిళపై  అలా మాట్లాడటం దారుణం. మీ స్వార్ధ రాజకీయాల కోసం ఇలా దిగజారి మాట్లాడడం  సిగ్గు చేటు. ఒక మహిళా మంత్రి కల్పిత ఆరోపణలు చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం దిగ్భ్రాంతికరం. నా భర్త గురించి తప్పుడు కథనాలు చెబుతున్న ఇలాంటి వ్యక్తులను నమ్ముతున్నారా? ఇది నిజంగా సిగ్గుచేటు. రాజకీయ నేతలు మరి ఇంత దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది..? రాహుల్ గాంధీ  మీరు  ఇతరుల గౌరవమర్యాదలను, నమ్మినట్లయితే దయచేసి మీ నేతలను అదుపులో ఉంచుకోండి. సదరు మహిళా మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పి, ఆమె చేసిన  వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోండి. భారత దేశ పౌరులను రక్షించండి’’ అని ట్వీట్‌ చేశారు.

అఖిల్ అక్కినేని మాట్లాడుతూ ” అమ్మా.. నువ్వు చెప్పిన ప్రతీ మాట నిజమే, నీకు నేను తోడుగా ఉంటా, నువ్వు ఇలాంటి నీచమైన వాటి గురించి మాట్లాడాల్సి వచ్చింది, సారీ అమ్మ,  కానీ మనకు ఇది తప్పదు, అలాంటి వాళ్లని కట్టడి చేయాలంటే ఇలా మాట్లాడక తప్పదు” అని అమల ట్వీట్ కు సమాధానంగా ‘X’ లో పోస్ట్ చేసాడు.

 

Show comments