Site icon NTV Telugu

Allu Sirish: నయనికతో అల్లు శిరీష్ పెళ్లి .. ఇట్స్ అఫీషియల్!

Allu Sirish

Allu Sirish

అల్లు బ్రదర్స్‌లో ఒకడైన అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశాడు. తన సోషల్ మీడియా వేదికగా ఈరోజు తన తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఒక విషయాన్ని షేర్ చేసుకోబోతున్నానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే తాను 31వ తేదీ అక్టోబర్ నయనికతో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. ఇటీవల కన్నుమూసిన తన నాన్నమ్మ కనకరత్నం ఎప్పుడూ తాను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ఉండేదని అన్నారు. ఆమె ఇప్పుడు లేకపోయినా పైనుంచి తన మీద ఆశీర్వాదాలు కురిపిస్తుందని నమ్ముతున్నట్లుగా వెల్లడించారు.

Also Read :NTV Podcast: బన్నీతో అందుకే అంత క్లోజ్ రిలేషన్!

మా కుటుంబాలు ఇకమీదట కలిసి ప్రయాణం చేయబోతున్నాయని అల్లు శిరీష్ ప్రకటించాడు. ఇక అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు నయానిక కాగా, ఆమె హైదరాబాద్‌కు చెందిన ఒక బిగ్ షాట్ కుమార్తె అని తెలుస్తోంది. అంతకు మించిన వివరాలు ఏవి బయటకు వెల్లడికాలేదు. చివరిగా “బండి” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లు శిరీష్. అయితే ఆశించిన మేర ఆ సినిమా ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇప్పటివరకు మరో తెలుగు సినిమాని ఆయన అనౌన్స్ చేయలేదు. ఎక్కువగా ముంబైలోనే ఉంటున్న అల్లు శిరీష్ హిందీ సినిమాల మీద ఫోకస్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం మీద అల్లు శిరీష్ ఎప్పుడూ స్పందించలేదు.

Exit mobile version