సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప”. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు, ధనంజయ్, ప్రకాష్ రాజ్, హరీష్, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్ల కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో 12 సంవత్సరాల తర్వాత వస్తున్న మూవీ ఇది. “పుష్ప”లో మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తుండగా… రష్మిక మందన్న హీరోయిన్ గా గిరిజన యువతి పాత్రలో కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా బ్యానర్‌లపై “పుష్ప”ను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
Read Also : భారీ ధరకు అమ్ముడైన “రాపో19” ఆడియో రైట్స్
గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. 2021 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న “పుష్ప”రాజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడని ప్రకటించారు. రెండవ భాగం 2022లో విడుదల కానుంది. తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు తెలుగులో భారీ రేంజ్ లో విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.