అల్లు అర్జున్ ప్రస్తుతానికి అట్లీ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా 2027వ సంవత్సరంలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే ప్రస్తుతానికి ముంబైలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముంబై టు హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా ఫైనల్ చేశాడు అనే విషయం మీద క్లారిటీ లేదు, కానీ ఆయన లైన్ అప్ మాత్రం తెలిస్తే మెంటల్ ఎక్కేలా ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఎవరెవరితో సినిమాలు ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.
* ప్రశాంత్ నీల్:
కొంతకాలం క్రితం దిల్ రాజు అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ మధ్య ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. అయితే అప్పటికే అది ఫార్మల్ మీటింగే కానీ, ప్రస్తుతం వీరిద్దరూ స్క్రిప్ట్ డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు సాలిడ్గా ఏది ఫైనలైజ్ అవ్వలేదు కానీ, ప్రశాంత్ నీల్ సహా అల్లు అర్జున్ ఫ్రీ అయ్యాక వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
* రాజమౌళి:
ప్రస్తుతానికి రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమా మీద ఫోకస్ పెట్టాడు. మరో రెండేళ్లయినా ఆ సినిమాకి ఈజీగా పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో ఏడాది పాటు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న తర్వాత అల్లు అర్జున్-రాజమౌళి కాంబినేషన్‌లో ఒక సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అల్లు కాంపౌండ్ చెబుతోంది.
Also Read : Akhanda 2 : “అఖండ 2 తాండవం” సాంగ్ డేట్ ఫిక్స్! థమన్ ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్
* సంజయ్ లీలా భన్సాలీ:
అల్లు అర్జున్, సంజయ్ లీలా భన్సాలీ గత ఏడాది నుంచి ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. పుష్ప రిలీజ్ అయినప్పటి నుంచి దాదాపుగా వీరిద్దరూ టచ్‌లోనే ఉన్నారు. ప్రస్తుతానికి అంతా పాజిటివ్‌గానే ఉంది. అన్నీ ఓకే అనుకుంటే వీరిద్దరి కాంబినేషన్ నుంచి కూడా ఒక సినిమా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
* సరైనోడు సీక్వెల్:
అల్లు అర్జున్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సరైనోడు సినిమాకి సీక్వెల్ మీద బోయపాటి శ్రీను పనిచేసే అవకాశం ఉంది. అఖండ డిసెంబర్‌లో రిలీజ్ అయిన తర్వాత సరైనోడు సీక్వెల్ మీద ఆయన కూర్చోబోతున్నారు. ఒకవేళ అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ ప్రాజెక్ట్ కూడా ఫైనలైజ్ అవ్వొచ్చు.
* కొరటాల శివ:
అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో గతంలోనే ఒక సినిమా అనౌన్స్ చేశారు. అయితే పలు కారణాలతో ఆ సినిమా హోల్డ్‌లో పడింది. పుష్ప 2 తర్వాత కూడా కొరటాల శివ అల్లు అర్జున్‌కి ఒక కథ చెప్పారు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేసుకో రమ్మని అల్లు అర్జున్ చెప్పారు. అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే, వీరి కాంబినేషన్‌లో కూడా సినిమా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.
అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు వీటిలో ఏ ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వలేదు కానీ, ఏదో ఒక ప్రాజెక్ట్‌తో బన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
