ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు దర్శకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. పాన్ ఇండియా హీరోగా ఆయనకు క్రేజ్ రావడంలో తెలుగు దర్శకుల పాత్ర ఉన్నప్పటికీ, బన్నీ ఇప్పుడు కేవలం ఇతర భాషల దర్శకులు చెప్పిన కథల మీదే దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ బ్లాక్‌బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. ఆయన ఇప్పుడు ‘అద్భుతం సృష్టించాలన్న’ ఆలోచనలో ఉన్నారు. ఇదే నేపథ్యంలో, తమిళ అగ్ర దర్శకుడు అట్లీతో బన్నీ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోలో, “ఇంతవరకు ఇలాంటి కథ వినలేదని” హాలీవుడ్ VFX నిపుణులు సైతం ఈ సినిమాను ప్రశంసించడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా ₹1000 కోట్లకు చేరుతోందని అంచనా.
Also Read :Samantha Ex Makeup Artist: ఎన్నైనా తిట్టండి కానీ..సమంత ఫాన్స్’కి మేకప్ ఆర్టిస్ట్ వార్నింగ్
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2026 సమ్మర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ ఒక సూపర్‌హీరోగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉన్నా, ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు సమాచారం. బన్నీకి హ్యాట్రిక్ హిట్స్ (జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో) ఇచ్చిన త్రివిక్రమ్‌ను కూడా బన్నీ పక్కన పెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. బన్నీ ప్లేస్‌లో త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న బన్నీ, ఆ తర్వాత ఏ దర్శకుడితో పనిచేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బన్నీ లిస్ట్‌లో ప్రస్తుతం తెలుగు దర్శకులు ఎవరూ లేరని తెలుస్తోంది. ఆయన ఇతర భాషల దర్శకుల కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
Also Read :Naari Naari Naduma Murari : పెద్ద సినిమాల నడుమ శర్వా సినిమా.. అయ్యే పనేనా?
సంజయ్ లీలా బన్సాలీ అనే బాలీవుడ్ దర్శకుడిని అల్లు అర్జున్ రెండుసార్లు కలిసినా, వీరి కాంబో వర్కవుట్ కాలేదని సమాచారం. బాసిల్ జోసెఫ్ అనే మలయాళ దర్శక నటుడు (మిన్నల్ మురళి ఫేమ్) కూడా బన్నీకి కథ చెప్పినట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కూడా బన్నీకి స్టోరీ లైన్ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ దృష్టి కేవలం పాన్-ఇండియా/గ్లోబల్ స్థాయిలో ఆశ్చర్యపరిచే కథలపైనే ఉంది. అందుకే, తెలుగుతో పాటు ఇతర భాషల దర్శకుల వైపు ఆయన మొగ్గు చూపుతున్నారని, తన స్థాయికి తగ్గ ‘యూనివర్సల్’ కథల కోసం చూస్తున్నారని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.
