NTV Telugu Site icon

Allu Arjun : పుష్ప ది రూల్ 24 గంటలు షోస్ ప్రయత్నాలు చేస్తున్నాం

Pushpa Rule

Pushpa Rule

స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. 2021 తర్వాత బన్నీని స్క్రీన్ పై చూడలేదు ఫ్యాన్స్. దీంతో పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్,శాండల్ వుడ్, మాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.ఈ చిత్రం నుండి ఏ కంటెంట్ రిలీజైన నేషనల్ లెవల్ లో వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా పుష్ప నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు మీడియా మీట్ నిర్వహించారు. ఈరోజు తెలుగు మీడియా మాత్రమే కాదు తమిళ కన్నడ మలయాళ హిందీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పుష్ప ది రూల్ ఇతర భాషల  డిస్ట్రిబ్యూటర్లు వివరాలు పరిశీలిస్తే  కర్ణాటక – లక్ష్మీ కాంత్ రెడ్డి n సినిమాస్, కేరళ – (ముఖేష్ మెహతా) ఈ 4 ఎంటర్టైన్మెంట్స్ , హిందీ – బెంగాలీ – ఏ ఏ ఫిలింస్ అనిల్ తడానీ, తమిళ్ – ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ద్వారా రిలీజ్ కానుంది.

తమిళ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ : తమిళనాడులో గోట్ రిలీజ్ చేసినన్ని థియేటర్లలో పుష్పా -2  రిలీజ్ చేస్తాంమని బాహుబలి -2 రికార్డ్స్ క్రాస్ అవుతుంది’ అని అన్నారు.

ముఖేష్ మెహతా మాట్లాడుతూ : కేరళలో రూ. 12 కోట్లతో డే – 1రికార్డు బద్దలు కొడుతుందని నమ్ముతున్నాం.. కేరళలలో 24 గంటలు సినిమా స్క్రీన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం’

మైత్రి శశి : నైజాంలో ముందుగా షోస్ ప్లాన్ చేస్తున్నాం. నైజాం ఆల్ టైమ్ రికార్డ్ కొట్టబోతున్నాం. తెలుగులో ఎన్నడూ చూడని విధంగా భారీ రిలీజ్ చేస్తాం.

అటు ఓవర్సీస్ లో పుష్ప – 2 ను డిసెంబరు 4న ప్రీమియర్స్ తో రిలీజ్ చేస్తున్నామని నిర్మాత నవీన్ అన్నారు.