NTV Telugu Site icon

Allu Arjun : పుష్ప – 2 రిలిజ్ డేట్ మారేది లేదు.. ఎవడొచ్చిన తగ్గేదేలేదు..

Pushapa

Pushapa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడా కూడా తగ్గేదిలేదు అన్నట్టుగా షూటింగ్ చక చక చేస్తున్నారు యూనిట్. దర్శకుడు సుకుమార్ మొదటి పార్ట్ కంటే మరింత పవర్ ఫుల్ గా సెకండ్ పార్ట్ ను రెడీ చేస్తున్నాడు. రోజురోజుకు పుష్ప గాని క్రేజ్ మరింత పెరిగిపోతుంది. వాస్తవానికి పుష్ప గాడి రూలింగ్ ఆగస్టు 15 నుండి స్టార్ట్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ డిలే కారణంగా  వాయిదా వేయాల్సి వచ్చింది.

Also Read : Pradeep : పవన్ కళ్యాణ్ టైటిల్ తో యాంకర్ ప్రదీప్ సినిమా

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను డిసెంబరు 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్. కానీ ఇటీవల ఈ సినిమా డేట్ మరోసారి మారిందని సంక్రాంతి అని క్రిస్మస్ అని ఇలా రకరాలుగా సోషల్ మీడియా లో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. వాటన్నిటికీ చెక్ పెడుతూ మేకర్స్ తాజాగా మరొక పోస్టర్ రిలీజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబరు 6న రిలీజ్ ఫిక్స్ అని తెలియజేస్తూ పోస్టర్ లో పేర్కొన్నారు. అలాగే రిలీజ్ కు ఒక రోజు ముందుగా అనగా డిసెంబరు 5 న రాత్రి 9:30 గంటలకు రెండు తెలుగు రాష్టాల్లో ప్రీమియర్స్ వేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు మైత్రీ నిర్మాతలు. హనుమాన్ చిత్ర స్ట్రాటజీని ఫాలో అవుతూ సినిమాపై మరింత అంచనాలు పెంచుతున్నారు. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి  దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.