NTV Telugu Site icon

Allu Arjun : పుష్ప – 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ వచ్చేసింది.. ఎక్కడంటే..?

Pushpa

Pushpa

హైదరాబాద్‌లో అక్టోబరు 28 నుండి వచ్చే నెల అనగా నవంబరు 28 దాకా సిటీలో ఈ కర్ఫ్యూ అమలులో ఉంది. దీంతో హైదరాబాద్ సిటీలో ఎటువంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి దొరకడం లేదు. ఈ ఆంక్షలతో సినిమా పరిశ్రమకు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. సినిమాలకు సంబంధించి అవుట్ డోర్ ఫంక్షన్స్ కు ఎటు వంటి అనుమతులు దొరకని నేపథ్యంలో ఐకాన్ స్టార్ నటించిన పుష్ప -2 కు నిర్మాతలు కాసింత టెన్షన్ పడ్డారు.మరో మూడు రోజుల్లో ఈ కర్ఫ్యూ గడువు ముగుస్తుంది.

Also Read : Kollywood : తమిళ సెలబ్రిటీల్లో పెరుగుతున్న విడాకుల కల్చర్

మరోవైపు పుష్ప రిలీజ్ టైమ్ దగ్గరపడుతోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేసారు మేకర్స్. ఈ నేపథ్యంలోహైదరాబాద్ లోని LB స్టేడియం లో చేసేందుకు అనుమతులు కోరారు. కానీ మైత్రీ వాళ్ళు కోరుకున్న తారీఖున LB స్టేడియంలో శ్రేయా ఘోషల్ కాన్సర్ట్ ఉండటంతో అక్కడ పుష్ప ఈవెంట్ చేసేందుకు కుదరలేదు. ఇక గచ్చిబౌలి స్టేడియంలో అయిన చేసుకునేందుకు అనుమతి కోరగా అందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇలా వివిధ కారణాల వలన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో చేసుకోవాలని సూచించగా అందుకు అంగీకరించారు మైత్రీ మూవీస్ నిర్మాతలు. దాంతో చక చక పర్మిషన్స్ కూడా ఇచ్చేసారు. ఇక పుష్ప ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. అటు అల్లు అభిమానులు ఇప్పటి నుండే రెడీ అవవుతున్నారు.

Show comments