AA23: బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్.. లోకేష్ ప్రాజెక్ట్ టైటిల్ ఇదేనట!

Aa23 Sensation

Aa23 Sensation

AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇండియన్ సినిమాలోనే మోస్ట్ క్రేజీ కాంబోలలో ఒకటైన బన్నీ – లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ గురించి ఫిల్మ్ నగర్‌ సర్కిల్స్‌లో ఒక క్రేజీ టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న #AA23 సినిమాకు మేకర్స్ మైండ్ బ్లోయింగ్ టైటిల్ లాక్ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా ‘గ్యాంగ్‌స్టార్’ అనే పవర్‌ఫుల్ పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారట. లోకేష్ తనదైన శైలిలో రక్తపాతం, తుపాకీల చప్పుడుతో కూడిన ఒక రా అండ్ రస్టిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను బన్నీ కోసం రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనూ అల్లు అర్జున్‌ను ఇప్పటివరకు ఎవరూ ఊహించని సరికొత్త మాస్ షేడ్‌లో చూపించబోతున్నారట. ఒకవైపు లోకేష్ మార్క్ డార్క్ యాక్షన్, మరోవైపు బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో రానున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’ షూటింగ్‌తో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. పక్కా ప్లానింగ్‌తో 2027 స్టార్టింగ్‌లోపు అట్లీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని బన్నీ భావిస్తున్నారట. ఆ వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా లోకేష్ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. 2027 చివరి నాటికే ‘గ్యాంగ్‌స్టార్’ షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా టీమ్ షెడ్యూల్స్ రెడీ చేస్తోంది. మొత్తానికి ఈ టైటిల్ లీక్‌తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టేశారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.