Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!

Allu Arjun

Allu Arjun

Allu Arjun: బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా మరోసారి మామూలుగా లేదు. రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన ‘జైలర్ 2’ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుండగా, తాజాగా ఈ చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా రజనీకాంత్ స్టైల్, బాక్సాఫీస్ స్టామినా గురించి బన్నీ వాడిన పంచ్ లైన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను చూసిన అనంతరం అల్లు అర్జున్ ‘జైలర్ 2’ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. “రజనీకాంత్ సార్ స్టార్ పవర్, ఆయన స్వాగ్, ఆరా ఏంటో ఈ సినిమా మరోసారి చూపించింది. ఒంట్లో అడ్రినలిన్ రష్ పెంచే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది” అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇక సినిమాకు ప్రాణం పోసిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌పై స్పందిస్తూ.. “బ్రదర్ అనిరుధ్.. మ్యూజిక్‌తో రచ్చ లేపేశావ్” అంటూ కొనియాడారు.

దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ టేకింగ్‌ను ఆకాశానికెత్తుతూ.. “షోమ్యాన్ నెల్సన్ గారు ఈసారి అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్‌ను డెలివర్ చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత.. అందరూ తమ మనసు పెట్టి ఈ సినిమా కోసం పనిచేశారు” అంటూ మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే బన్నీ చేసిన ట్వీట్‌లో అందరినీ విపరీతంగా ఆకర్షించింది మాత్రం కలెక్షన్లపై ఆయన వేసిన పవర్‌ఫుల్ పంచ్. “చొక్కా నలగకుండా 500 కోట్లకు పైగా వసూళ్లు కొట్టడం ఒక్క రజినీకాంత్ గారికే సాధ్యం” అంటూ అల్లు అర్జున్ రాసుకొచ్చారు. రజనీ బాక్సాఫీస్ స్టామినాను ఇంత సింపుల్‌గా, అంత పవర్‌ఫుల్‌గా ఎలివేట్ చేయడం రజినీ అభిమానులందరినీ మెప్పిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఈ జైలర్ 2 మూవీ రివ్యూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.