Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!

Allu Arjun

Allu Arjun

Allu Arjun: అగ్ర హీరోలు తమ ఇమేజ్ చట్రం దాటి బయటకు రావడానికి ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది ఫుల్ ఫామ్‌లో ఉన్న టైమ్‌లో, ఓ లేడీ ఓరియెంటెడ్ హిస్టారికల్ మూవీలో స్పెషల్ రోల్ చేయడానికి ఒప్పుకోవడమంటే మామూలు డేరింగ్ స్టెప్ కాదు. ఆ రిస్క్‌ను నెత్తినెత్తుకుని, అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డిగా విధ్వంసం సృష్టించి చరిత్ర లిఖించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సరిగ్గా 11 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద రికార్డుల దుమ్ముదులిపిన ఆ పాత్రను గుర్తుచేసుకుంటూ బన్నీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సాధారణంగా ఒక స్టార్ హీరోయిన్ చుట్టూ తిరిగే కథల్లో హీరోలు అతిథి పాత్రలు చేస్తే వాళ్లను ఆడియన్స్ పెద్దగా పట్టించుకుంటారో లేదో అనే భయం ఉంటుంది. కానీ డైరెక్టర్ గుణశేఖర్ ‘గోన గన్నారెడ్డి’ పాత్రను డిజైన్ చేసిన విధానం, దానికి బన్నీ ఇచ్చిన ట్రీట్‌మెంట్ వెండితెరపై ఒక మాస్ సునామీని తెచ్చాయి.

నల్లటి దుస్తులు, కత్తి పట్టిన తీరు, రాబిన్‌హుడ్ తరహా బందిపోటు యోధుడి స్వాగ్ చూసి ఆడియన్స్ పూనకాలతో ఊగిపోయారు. “ఏయ్… గమ్మునుండవోయ్” అంటూ పక్కా తెలంగాణ స్లాంగ్‌లో ఆయన పలికిన డైలాగ్‌లు తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ఐకానిక్ పంచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. ఈ చారిత్రక దృశ్యకావ్యం రిలీజై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్న అల్లు అర్జున్.. “నా సినీ కెరీర్‌లోనే గోన గన్నారెడ్డి అత్యంత ఐకానిక్ పాత్ర. ఈ ప్రయాణంలో తోడున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్.. ఏయ్… గమ్మునుండవోయ్” అంటూ ట్వీట్ చేశారు. నిర్మాణ సంస్థ గుణా టీమ్‌వర్క్స్ కూడా ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. అనుష్క, రాణా, ప్రకాశ్ రాజ్, కృష్ణంరాజు లాంటి ఉద్దండులు ఉన్నప్పటికీ, సినిమా హాళ్లలో ఏ మూల చూసినా ‘గోన గన్నారెడ్డి’ పేరే మార్మోగింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని వెనకడుగు వేయకుండా, కంటెంట్‌ను నమ్మి బన్నీ తీసుకున్న ఆ నిర్ణయమే ఆయనను ఈ రోజు పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన రిస్క్ టేకింగ్ ధైర్యానికి పునాదిగా నిలిచిందని సినీ విశ్లేషకులు గుర్తుచేసుకుంటుంటారు.