NTV Telugu Site icon

Allu Arjun : ‘చిక్కు బాబాయ్‌’కి చిన్నప్పటి నుంచే ఫ్యాన్

Aha

Aha

అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ సాగుతోంది. ఇప్పటికే దుల్కర్, సూర్య వంటి స్టార్స్ సందడి చేసిన అన్‌స్టాపబుల్ స్టేజ్ పై ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా విచ్చేసారు. రెండు భాగాలుగా స్పెషల్ ఎపిసోడ్స్ గా తీసుకువచ్చారు. మొదటి ఎపిసోడ్ ను గత వారం సస్ట్రీమింగ్ కు తీసుకు వచ్చిన ఆహా, రెండవ ఎపిసోడ్ ను నేటి నుండి స్ట్రీమింగ్ చేస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్ లో బన్నీ తో పాటు తల్లి సరళ కూడా విచ్చేయగా లేటెస్ట్ ఎపిసోడ్ కు అల్లు అర్జున్ పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్ పాల్గొన్నారు.

Also Read : Pushpa 2 : మల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్పరాజ్ కేరళ వస్తున్నాడు

బన్నీ నటిస్తున్న ‘పుష్ప ది రూల్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్‌  అన్‌స్టాపబుల్ సెట్స్ లో సందడి చేశారు.ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు హోస్ట్ బాలయ్యతో పంచుకున్నాడు బన్నీ. ఇటీవల అల్లు vs మెగా పోరు నడుస్తున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవిపై అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవితో తన చిన్ననాటి అనుభవాలను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షేర్ చేసుకున్నారు. చిరుకు తాను చిన్నప్పటి నుంచే బిగ్గెస్ట్ ఫ్యాన్ ని, చిరంజీవి అంటే నాకు ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. కానీ, నా చిన్నతనం నుండే ఆయన వ్యక్తిత్వానికి నేను బిగ్ ఫ్యాన్ అయ్యాను. నేను చిన్నవయసులో ఉన్నప్పుడు నన్ను
అలాగే తమ్ముడు శిరీష్ ను విదేశాలకు తీసుకెళ్లారు. అప్పట్లో మేమందరం చిరుని ‘చిక్కు బాబాయ్’ అని పిలిచే వాళ్ళం’ అని అన్నాడు