NTV Telugu Site icon

Allu Arjun: అల్లు అర్జున్ కి పోటీ ప్రభాసా? మహేషా? అంత మాట అనేశాడు ఏంటి?

Allu Arjun

Allu Arjun

నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే కొత్త ఎపిసోడ్ గురించి ఇప్పుడు అంతా హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ గత సీజన్లోని ఒక ఎపిసోడ్ చేశారు. ఇప్పుడు త్వరలో పుష్ప 2 సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆ ప్రమోషన్ కోసం మరో ఎపిసోడ్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ లోనే అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ముందుగా బాలకృష్ణ అనేక ఆసక్తికర అంశాలను అల్లు అర్జున్ ముందు ప్రస్తావిస్తే ఆ అంశాలకు సంబంధించి అల్లు అర్జున్ మరింత ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం నీకు బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఎవరు? ప్రభాస్ లేదా మహేష్ బాబు ఇద్దరిలో ఎవరో ఒకరి పేరు చెప్పాలి అని అంటే దానికి అల్లు అర్జున్ అసలు ఎవరు ఊహించని సమాధానం ఇచ్చారు.

Allu Arjun: కోస్తే ఎల్లో బ్లడ్.. బాలయ్య ముందే అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు

సాధారణంగా ఇద్దరిలో ఎవరో ఒకరి పేరు ఎంచుకుంటాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ నన్ను మించి ఎదిగేటోడు ఇంకొకడు ఉన్నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే అంటూ పుష్ప మొదటి భాగంలోని ఒక పాట లిరిక్స్ వినిపించిన అల్లు అర్జున్ తనకు తానే పోటీ అని తనకు తానే సాటి అని చెప్పుకున్నట్లు అయింది. ఇక పుష్ప మొదటి భాగంలో ఈ పాట సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా పుష్ప క్యారెక్టరైజేషన్ ని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడానికి కూడా బాగా ఉపయోగపడింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ నాతో నాకే పోటీ అంటూ చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం మీద పాజిటివ్గా చాలా మంది స్పందిస్తుంటే కొంతమంది నెగటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారనుకోండి అది వేరే విషయం. ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఈ క్లిప్ మాత్రమే కాదు అనేక క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show comments