Nagendra Kasi: ‘రాకా’ నుంచి మైండ్ బ్లాక్ అప్‌డేట్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ల్యాండ్‌మార్క్ అంటూ కామెంట్స్!

Tollywood (1)

Tollywood (1)

Nagendra Kasi: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రానున్న రోజుల్లో ఒక సినిమా సంచలనం సృష్టించబోతుందని రైటర్ నాగేంద్ర కాశీ చెప్పారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రాకా’ (Raka) గురించి. తాజాగా ఆయన ఒక ఇంటర్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాకా’ సెట్స్‌లో జరుగుతున్న హంగామాను చూసి షాక్ అయినట్లు చెప్పారు. “భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు అట్లీ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. సెట్‌లోని ఎనర్జీ, ఇంటెన్సిటీ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక ల్యాండ్‌మార్క్ సినిమా కాబోతోంది” అంటూ నాగేంద్ర కాశీ చెప్పుకొచ్చారు.

ఇక రాకా చిత్రం విషయానికి వస్తే ఇదొక పూర్తి సరికొత్త జోనర్‌లో రాబోతోంది. ఈ మూవీ హై-బడ్జెట్ సై-ఫై యాక్షన్ ఫాంటసీ మూవీ అని సమాచారం. ఇందులో అల్లు అర్జున్ సరికొత్త రగ్డ్‌ వారియర్ లుక్‌లో, ఊహించని భారీ ట్విస్ట్‌లతో కనిపించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో ఆయన సరసన బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తు్న్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై పాన్ – ఇండియా లెవెల్లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌ (VFX) గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అట్లీ మాస్ విజన్, అల్లు అర్జున్ క్రేజ్, దీపికా గ్లామర్, సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ నాల్గింటి కలయిక ఇండియన్ సినిమా రేంజ్‌ని మార్చేయడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం రాకెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ‘రాకా’ దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయమని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడే ఫిక్స్ అయిపోతున్నారు.

×
×
Ad