Nagendra Kasi: ‘రాకా’ నుంచి మైండ్ బ్లాక్ అప్డేట్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ల్యాండ్‌మార్క్ అంటూ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagendra Kasi: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రానున్న రోజుల్లో ఒక సినిమా సంచలనం సృష్టించబోతుందని రైటర్ నాగేంద్ర కాశీ చెప్పారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రాకా’ (Raka) గురించి. తాజాగా ఆయన ఒక ఇంటర్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాకా’ సెట్స్‌లో జరుగుతున్న హంగామాను చూసి షాక్ అయినట్లు చెప్పారు. “భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు అట్లీ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. సెట్లోని ఎనర్జీ, ఇంటెన్సిటీ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక ల్యాండ్‌మార్క్ సినిమా కాబోతోంది” అంటూ నాగేంద్ర కాశీ చెప్పుకొచ్చారు.
ఇక రాకా చిత్రం విషయానికి వస్తే ఇదొక పూర్తి సరికొత్త జోనర్లో రాబోతోంది. ఈ మూవీ హై-బడ్జెట్ సై-ఫై యాక్షన్ ఫాంటసీ మూవీ అని సమాచారం. ఇందులో అల్లు అర్జున్ సరికొత్త రగ్డ్ వారియర్ లుక్‌లో, ఊహించని భారీ ట్విస్ట్‌లతో కనిపించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో ఆయన సరసన బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్గా నటిస్తు్న్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై పాన్ – ఇండియా లెవెల్లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అట్లీ మాస్ విజన్, అల్లు అర్జున్ క్రేజ్, దీపికా గ్లామర్, సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ నాల్గింటి కలయిక ఇండియన్ సినిమా రేంజ్‌ని మార్చేయడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం రాకెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ‘రాకా’ దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయమని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడే ఫిక్స్ అయిపోతున్నారు.
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
తాజావార్తలు
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!