NTV Telugu Site icon

Allu Arjun: మరణించిన మహిళ కుటుంబానికి 25 లక్షలు ప్రకటించిన అల్లు అర్జున్

Pushpa

Pushpa

అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్లో ఏర్పడిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ఇప్పటికే సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. తాజాగా ఈ విషయం మీద స్పందిస్తూ అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ట్విట్టర్ వేదిక వీడియో రిలీజ్ చేసిన ఆయన సంధ్య థియేటర్లో జరిగిన దారుణ ఘటన తనకు తీవ్రమైన మనోవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ కఠినమైన సమయంలో తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్న అని చెప్పుకొచ్చారు. నేను త్వరలోనే ఆ కుటుంబాన్ని కలుస్తాను వారు ఈ బాధను ఒంటరిగా అనుభవించడం తనకి ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. వాళ్లకు వీలైనంత సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అని పేర్కొన్నారు. మొన్న మేము పుష్ప సినిమా ప్రీమియర్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా జనాలు ఎక్కువగా రావడం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏమిటంటే ఒక మహిళ మృతి చెందింది.

Delhi: ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు.. నిందితుడి మొబైల్‌లో ఏమున్నాయంటే..!

అలాగే కుటుంబ సభ్యుల్లో కొందరికి దెబ్బలు తగిలినట్టు తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు మేమందరం టీం ఆఫ్ పుష్ప అందరూ డిసప్పాయింట్ అయి ఒక షాక్ లోకి వెళ్ళాము. ఎందుకంటే ఇది ఎవరూ ఊహించనిది. ప్రతి పెద్ద సినిమాకి మెయిన్ థియేటర్ కి వెళ్లి సినిమా చూసి రావడం అనేది ఒక ఆనవాయితీ. ఇన్నేళ్లుగా ఎప్పుడూ జరగనిది ఇప్పుడు సడన్గా జరగడంతో మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఈ వార్త తెలిసిన తర్వాత మేము పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. మేము సినిమా తీసేదే జనాలు థియేటర్లోకి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పటికీ మాటల్లో చెప్పలేని బాధ కలిగింది. రేవతి గారి ఫ్యామిలీ మొత్తానికి నా తరఫున సంతాపం అలాగే నా పుష్ప టీం మొత్తం తరపున సంతాపం తెలియజేస్తున్నాను. మేమేం చేసినా ఎంత మాట్లాడినా మీకు కలిగిన నష్టాన్ని మేము భర్తీ చేయలేము అంటూ ఆయన మాట్లాడారు. అయితే ఒక గుడ్ విల్ గెస్చర్ గా 25 లక్షలు వారి ఫ్యూచర్ కోసం ఇస్తున్నా, ఈ 25 లక్షలకి సంభంధం లేకుండా మెడికల్ ఖర్చులు భరిస్తా అలాగే ఫ్యామిలీ భాద్యత నాదేనని అన్నారు. సినిమా చూసి ఇంటికి సేఫ్ గా వెళ్లండని ఆయన కోరారు.

Show comments