Site icon NTV Telugu

అఫిషియల్ : “శాకుంతలం”తో అల్లు అర్హ ఎంట్రీ

Allu Arha will be playing the role Prince Bharata in Shaakuntalam

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తెరంగ్రేటం ఖరారైంది. ఈ మేరకు ఆమె ఎంట్రీని ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా “శాకుంతలం” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారానే అల్లు అర్హ తెరంగ్రేటం చేయబోతోంది. ఇందులో రాజకుమారుడు భరతుడిగా ఆమె నటించబోతున్నట్టు చిత్రబృందం ధృవీకరించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులో అర్హను గుణశేఖర్ ఎత్తుకుని కన్పించారు.

Read Also : బుక్కు రాసినందుకు కరీనాపై కేసు బుక్ చేయాలట!

ఈ రోజే అర్హ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించనుంది. 10 రోజుల పాటు జరగనున్న చిత్రీకరణ తరువాత అర్హ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. అయితే అల్లు అర్హ మొదటి చిత్రమే పాన్ ఇండియా లెవెల్ భారీ మూవీ కావడం విశేషం. ఇక దీనితో అల్లు ఫ్యామిలిలోని నాలుగవ తరం కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్టు అవుతుంది. కాగా సమంత అక్కినేని ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. తన కూతురు సమంత, గుణశేఖర్ వంటి వారితో కలిసి పని చేయడం గురించి స్పందించిన అల్లు అర్జున్ చాలా ఆనందంగా ఉందని అన్నారు. “శాకుంతకాలం” చిత్రానికి శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప” చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Exit mobile version