బుక్కు రాసినందుకు కరీనాపై కేసు బుక్ చేయాలట!

బుక్ రాసినందుకుగానూ కరీనాపై కేసు బుక్కైంది! ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో తైమూర్, జెహ్ వాళ్ల మమ్మీ ఓ పుస్తకం రాసింది. తాను రెండుసార్లు గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి శారీరిక, మానసిక అనుభవాలకు లోనైంది బెబో తన పుస్తకంలో వివరించింది. అయితే, సదరు ‘ప్రెగ్నెస్సీ’ ఎక్స్ పీరియెన్సెస్ కి ‘బైబిల్’ పదం జత చేయటంతో ‘అల్ఫా ఒమేగా క్రిస్టియన్ మహాసంఘ్’ సంస్థకు కోపం వచ్చింది. మహారాష్ట్రలోని బీడ్ పట్టణంలో కరీనాతో పాటూ మరికొందరిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు!

Read Also : పిసినారి సునీల్… ఇబ్బందుల్లో వెంకీ!

‘బైబిల్’ పదం తమకు ఎంతో పవిత్రమైందని పేర్కొన్న ‘క్రిస్టియన్ మహాసంఘ్’ నాయకులు కరీనా, ఆమెతో పాటూ పుస్తక రచనలో పాలుపంచుకున్న అదితి షా అనే సహ రచయిత మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. అయితే, పోలీసులు మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ‘ప్రెగ్నెసీ బైబిల్’ పుస్తకాన్ని జూలై 9న కరీనా ముంబైలో ఆవిష్కరించింది. కాబట్టి కంప్లైంట్ ముంబై నగరంలోనే ఇవ్వాలని బీడ్ ప్రాంత పోలీసులు ఫిర్యాదుదారులకి సూచించారు. చూడాలి మరి, ‘ఈ బుక్ నా మూడో బిడ్డ లాంటి’దని కరీనా చెప్పుకున్న ‘ప్రెగ్నెసీ బైబిల్’ ముందు ముందు ఎలాంటి చట్టపరమైన చిక్కులు తెచ్చిపెడుతుందో! పోలీసు కేసు, కోర్టులో విచారణ వంటివి పక్కన పెడితే… బెబో రాసిన బుక్కుపై ‘బైబిల్’ వివాదం… పబ్లిసిటీకైతే ఇప్పటికిప్పుడు ఉపయోగపడుతుంది! అందులో సందేహం లేదు…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-