కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన కామెడీ మూవీస్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన నరేష్ కు వరుసగా ఫ్లాప్స్ రావడంతో కామెడీ జోనర్ ను పక్కనపెట్టి సీరియస్ పాత్రలతో నరేష్ ప్రేక్షకులను మెప్పించడం మొదలు పెట్టాడు.నరేష్ నటించిన నాంది,ఉగ్రం వంటి సీరియస్ మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి.అయితే వరుసగా సీరియస్ మూవీస్ చేస్తున్న నరేష్ కామెడీ మిస్ అవుతున్నట్లు కొందరు తెలియజేయగా నరేష్ రూటు మార్చి తనకి ఎంతో ఇష్టమైన కామెడీ జోనర్ లో తాజాగా ఓ సినిమాను చేసాడు.తాను నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ “ఆ ఒక్కటి అడక్కు”.ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి మల్లి అంకం దర్శకత్వం వహించగా.. రాజీవ్ చిలక నిర్మించారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ ఒక్కటీ అడక్కు మూవీ నేడు(మే 3) ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.
ఈ మూవీలో అల్లరి నరేష్ పెళ్లి కాని ప్రసాద్ పాత్రలో నటించాడు. వయసు ముదురుతున్న పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్క ఇబ్బంది పడే యువకుడు పాత్రలో అల్లరి నరేష్ నటించాడు.ప్రస్తుతం పెళ్లి అనేది ఓ బర్నింగ్ టాపిక్ ఏళ్ళు గడిచిన పెళ్లి కాకపోవడం ఒక సమస్య అయితే ఈ సమాజానికి సమాధానం చెప్పుకోలేకపోవడం మరొక సమస్య. ఈ పాయింట్ ఆధారంగా అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు మూవీ తెరకెక్కింది.తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని చుసిన ప్రేక్షకులు ట్విట్టర్ రివ్యూస్ ఇస్తున్నారు.వారు ఇచ్చిన రివ్యూస్ ఎలా వున్నాయంటే..ఈ మూవీ ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అన్నట్లుగా అనిపిస్తుంది. దర్శకుడు పెళ్లిని బిజినెస్ గా మార్చేసిన విధానం.పెళ్లి విషయంలో మాట్రిమోని సైట్స్ పాటించే పద్దతులను కామెడీగా చెప్పే ప్రయత్నం చేశాడు.పెళ్లికాని ప్రసాద్ పాత్రలో అల్లరి నరేష్ అద్భుతంగా నటించాడు.హీరోయిన్ ఫరియా తన క్యూట్ యాక్టింగ్ తో మెప్పిస్తుంది. వెన్నెల కిషోర్ మరియు వైవా హర్ష తమదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు.ఫస్ట్ హాఫ్ పర్లేదు అన్నట్లుగా అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ ని కూడా కామెడీతో ఆరంభించిన దర్శకుడు సీరియస్ ఇష్యు వైపు కథని మరలిస్తాడు.ఈ సినిమా క్లైమాక్స్ చాలా బాగుందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.