యంగ్ హీరో నితిన్, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ నుంచే టాలీవుడ్‌లో భారీ బజ్‌ను క్రియేట్ చేసిన తాజా చిత్రం ‘ఏలియాస్ రుక్మిణి’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేస్తూ అసలు ‘రుక్మిణి’ ఎవరో రివీల్ చేసింది. కృష్ణుడి ప్రాణమైన రుక్మిణి పాత్రలో కొత్త ముఖం ఆఫియా సయ్యద్ (Aafiya Sayed) ను రంగంలోకి దించి అందరినీ సర్ప్రైజ్ చేశారు.
సెన్సేషనల్ లుక్.. గ్లింప్స్ వీడియోలో ఆఫియా సయ్యద్ సంప్రదాయ పసుపు రంగు చీరకట్టులో, చేతిలో పుస్తకాలు పట్టుకుని స్ట్రిక్ట్ టీచర్‌గా నడుచుకుంటూ వచ్చే విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఆమెను చూసి స్కూల్ విద్యార్థులు వేసిన కార్టూన్ డ్రాయింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమెను కేవలం టీచర్‌గా మాత్రమే కాకుండా బోర్డుపై ‘డెవిల్’, ‘హిట్లర్’, ‘హోమ్‌వర్క్ పోలీస్’ అంటూ రాసి ఉండటం, దానికి ఆమె సీరియస్ లుక్ ఇవ్వడం విశేషం. ఒక హీరోయిన్ ఇంట్రడక్షన్‌ను ఇంత అన్‌ఫిల్టర్డ్, రా అండ్ రస్టిక్ కోణంలో చూపించడం హాట్ టాపిక్ గా మారింది.
డిసెంబర్ 4న బాక్సాఫీస్ వార్.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మురళీకాంత్ దేవసోత్ డైరెక్ట్ చేస్తుండగా, దీప్తి గంటా నిర్మిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని స్వయంగా సమర్పిస్తుండటంతో సినిమా కంటెంట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. విజయ్ బుల్గానిన్ సంగీతం, జోమోన్ టి. జాన్ కెమెరా పనితనం ఈ గ్లింప్స్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నితిన్‌కు జోడీగా ఆఫియా సయ్యద్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుందో చూడాలి!

