Site icon NTV Telugu

“ఆర్ఆర్ఆర్” టీంలో చేరిన అలియా

Alia Bhatt joins the RRR team

జక్కన్న దర్శకత్వంలో దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తున్న “ఆర్ఆర్ఆర్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. తాజగా అలియా భట్ “ఆర్ఆర్ఆర్” టీంతో చేరినట్టు సమాచారం. భారతీయ అతిపెద్ద మల్టీస్టారర్ మూవీ షూటింగ్ చివరి దశ షూటింగ్ లో పాల్గొంటున్నారు అలియా ఓ పిక్ ద్వారా ప్రకటించింది. ఇందులో అలియా భట్ సాంగ్ చిత్రీకరణలో పాల్గొంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ, సారధి స్టూడియోలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్లలో “ఆర్ఆర్ఆర్” షూటింగ్ జరుగుతోంది.

Read Also : దుల్కర్ తర్వాత అఖిల్ తో హను రాఘవపూడి సినిమా

ప్రమోషనల్ సాంగ్, ప్యాచ్ వర్క్ పూర్తి చేసిన తరువాత, బృందం మరో ముఖ్యమైన పాటను చిత్రీకరించడానికి తూర్పు ఐరోపాకు చిత్రబృందం వెళుతుంది. మరోవైపు అప్పుడే రాజమౌళి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” మేకింగ్ వీడియోతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌లలో చూడటానికి అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం 2021 అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version