Actor Ali: అలీకి లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో నటించిన ప్రముఖ నటుడు అలీ, నటుడుగా 1250 సినిమాలను పూర్తి చేసుకున్నారు. గత 16 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాల ద్వారా అనేకమందికి సహాయం అందిస్తూ వస్తున్నారు. అలీ నటనా ప్రతిభ మరియు సామాజిక సేవలను గుర్తించిన కర్ణాటక మీడియా జర్నలిస్ట్ యూనియన్, గీమా సంస్థతో కలిసి, ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేసింది. దుబాయ్‌లోని ఫ్యూచర్ మ్యూజియంలో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ అవార్డు వేడుక, అక్కడ తొలిసారిగా నిర్వహించబడటం గమనార్హం.
Tollywood : సినిమాలో దమ్ముంటే ట్రోల్స్ ఆపుతాయా..?
Also Read
ఈ కార్యక్రమంలో అనేకమంది కన్నడ నటీనటులు, కళాకారులు, వ్యాపారవేత్తలకు గీమా సంస్థ వివిధ అవార్డులు ప్రదానం చేసింది. తెలుగు ఇండస్ట్రీ నుండి అలీ ఒక్కరే ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ, “తెలుగు ఇండస్ట్రీ నుండి నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇలాంటి అవార్డులు మాకు ప్రోత్సాహాన్ని అందించి, మరిన్ని మంచి సినిమాలు చేయడానికి మరియు నలుగురికి సహాయం చేయడానికి ప్రేరణనిస్తాయి. నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు,” అని అన్నారు. ఈ వేడుకలో దుబాయ్‌కు చెందిన అనేకమంది అధికార ప్రతినిధులు, షేక్‌లు కూడా పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!