బాలీవుడ్ లో మరో యంగ్ బ్యూటీ దూకుడు పెంచింది. ‘జవానీ జానేమన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అలాయా ఎఫ్ వరుసగా రెండు సినిమాల్లో లీడ్ రోల్స్ కొట్టేసింది. మొదటి చిత్రంలోనే సైఫ్, టబు వంటి సీనియర్ నటులతో తెర పంచుకున్న అలాయా నెక్ట్స్ కార్తీక్ ఆర్యన్ లాంటి హ్యాండ్సమ్ తో కనిపించబోతోంది. ఏక్తా కపూర్ నిర్మించే ‘ఫ్రెడ్డీ’ సినిమాలో ఈ యువ జంట రొమాన్స్ చేయనున్నారు.
కార్తీక్ ఆర్యన్ తో ‘ఫ్రెడ్డీ’ మూవీలో నటించాల్సిన అలాయా ఇంకా పేపర్స్ పై సంతకం చేయలేదు. ఆమె మూవీ సైన్ చేసే ముందు ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయట. ఆ సంగతి ఎలా ఉన్నా ఏక్తా కపూర్ నిర్మాణంలోనే అలాయా ఎఫ్ మరో సినిమాలో ఆల్రెడీ నటిస్తోంది. కన్నడ చిత్రం ‘యూ టర్న్’కి హిందీ రీమేక్ తెరకెక్కుతోంది. అందులో లీడ్ రోల్ అలాయాదే! కన్నడలో శ్రద్ధా శ్రీనాథ్, తెలుగులో సమంత సేమ్ క్యారెక్టర్ చేసిన సంగతి తెలిసిందే. అలాయా బాలీవుడ్ ‘యూ టర్న్’ని ప్రేక్షకుల ముందుకి ఎలా తీసుకెళుతుందో మరి…
బాలీవుడ్ ఫ్రెష్ బ్యూటీకి బంపర్ ఆఫర్…
