Site icon NTV Telugu

Akshi Kumar : బాలీవుడ్ ‘హౌస్‌ఫుల్‌ 5’ మూవీకి సెన్సార్‌ దెబ్బ..!

House Full5

House Full5

బాలీవుడ్‌ సినిమాల పరిస్థితి ఎలా ఉందో చెప్పక్కర్లేదు. కరోనా తర్వాత చాలా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడుతూ.. సక్సెస్‌ రేటు దారణంగా పడి పోయింది. ఇలాంటి సమయంలో స్టార్‌ హీరోల సినిమాలు వస్తున్నా కూడా పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోలేక పోతున్నాయి. షారుఖ్, సల్మాన్ అంతకంత ప్రయత్నిస్తున్న కూడా లాభం లేకుండా పోతుంది. ఇక చిన్న హీరోల సినిమాలు అయితే అసలు ఎప్పుడోస్తున్న‌యె కూడా తెలియడం లేదు. ఇక పోతే బాలీవుడ్‌ అల్ టైం ఎంటర్ టైన్నిగ్ హిట్ మూవీస్‌లో ‘హౌస్‌ఫుల్’ ఒకటి. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నాలుగు చిత్రాలు రాగా.. ప్రతి ఒక్క మూవీ కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి 5వ ఫ్రాంచైజీ రాబోతుంది.

Also Read : Sai Rajesh : కలర్ ఫోటో, బేబీ మేకర్స్ నుంచి మరో క్లాసిక్ లవ్ స్టోరీ..

తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, అభిషేక్ బ‌చ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో న‌టిస్తుండ‌గా. నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాడ్‌వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రం జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా రీసెంట్‌గా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయగా మొదటి నాలుగు భాగాల వలె ఇది కూడా నాన్ స్టాప్ లాఫింగ్ మూవీలా తెరకెక్కించినట్లు క్లియర్‌గా తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. కాగా సెన్సార్ టీమ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్‌ ఇచ్చింది. అంతే కాదు సమాచారం ప్రకారం కొన్ని బూతు డైలాగ్స్‌, ఎక్కువ శాతం స్కిన్‌ షో షాట్స్‌ను సెన్సార్‌ బోర్డ్‌ వారు కట్‌ చేశారని తెలుస్తోంది. సెన్సార్‌ కట్స్‌ వల్ల హౌస్‌ఫుల్‌ 5 సినిమా కొన్ని కామెడీ సీన్స్‌ను మిస్‌ అయినట్లు బాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Exit mobile version