Site icon NTV Telugu

Akkineni Nagarjuna: సీఎం చంద్రబాబుతో అక్కినేని నాగార్జున భేటీ.. విషయం ఏంటంటే?

Akkineni Nagarjuna

Akkineni Nagarjuna

Akkineni Nagarjuna: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు సినీ హీరో అక్కినేని నాగార్జున.. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన నాగార్జున.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. తన చిన్నకుమారుడు అక్కినేని అఖిల్‌ వివాహ ఆహ్వానపత్రికను సీఎం చంద్రబాబుకు అందజేసిన నాగార్జున.. తన కుమారుడి పెళ్లి రావాలంటూ ఆహ్వానించారు..

Read Also: West Bengal: మేనల్లుడిని చంపిన అత్త.. అసలు కథేంటంటే..!

కాగా, గ‌తేడాది అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య – శోభితా వివాహ‌ బంధంలోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు ఆయ‌న‌ చిన్న కుమారుడు అఖిల్ కూడా పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు.. ఇప్పటికే ప్రముఖ బిజినెస్‌మెన్ జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో గతేడాది నవంబర్ 26వ తేదీన అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేశారు.. ఇక, ఈ నెల 6వ తేదీన అక్కినేని అఖిల్ – జైనబ్‌ వివాహం నిర్వహించబోతున్నారు.. జైనబ్ హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి.. కొన్ని ఏళ్లుగా అఖిల్‌తో ప్రేమలో ఉన్నారు.. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సహా పలువురు ప్రముఖులను కలిసి అక్కినేని నాగార్జున ఆహ్వానించిన విషయం విదితమే.. ఇక, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ – జైనబ్‌ వివాహం జరగనున్నట్టుగా తెలుస్తుండగా.. ఆ త‌ర్వాత రాజ‌స్థాన్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారని సమాచారం..

Exit mobile version