Akkineni Family: వరద బాధితులకు అక్కినేని కుటుంబం సాయం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Family and group Companies Announce One Crore For Flood Relief Works: భారీ వర్షాలు వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలు వరదమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాధితులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కూడా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తే వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి విరాళాలు అందుతున్నాయి. తాజాగా అక్కినేని ఫ్యామిలీ కూడా తమ వంతు విరాళం ప్రకటించింది.
Puri Jagannadh: పూరి జగన్నాధ్ పరిస్థితి ఏంటి?
Also Read
అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుంటారు అని ఆయన బాటలోనే పయనిస్తూ వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నాం అని అయన ఫ్యామిలీ ప్రకటించింది. “ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాము. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం’ అని ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ డొనేషన్ ని అందజేస్తున్నాయి.
తాజావార్తలు
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!