NTV Telugu Site icon

Akkineni Family: వరద బాధితులకు అక్కినేని కుటుంబం సాయం ఎంతంటే?

Akkineni Family

Akkineni Family

Akkineni Family and group Companies Announce One Crore For Flood Relief Works: భారీ వర్షాలు వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలు వరదమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాధితులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కూడా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తే వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి విరాళాలు అందుతున్నాయి. తాజాగా అక్కినేని ఫ్యామిలీ కూడా తమ వంతు విరాళం ప్రకటించింది.

Puri Jagannadh: పూరి జగన్నాధ్ పరిస్థితి ఏంటి?

అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుంటారు అని ఆయన బాటలోనే పయనిస్తూ వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నాం అని అయన ఫ్యామిలీ ప్రకటించింది. “ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాము. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం’ అని ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ డొనేషన్ ని అందజేస్తున్నాయి.

Show comments