Site icon NTV Telugu

Lenin: అయ్యగారు ‘లెనిన్’.. ఈసారి కొట్టేట్టుగానే ఉన్నాడే!

Lenin

Lenin

అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటికే పలు సినిమాలు చేశాడు, కానీ సాలిడ్ హిట్ ఒకటి కూడా లేదు. ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన, తన ఆరవ సినిమాకి ఒక ఆసక్తికరమైన రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమా డైరెక్టర్ చేసిన మురళీ కిషోర్ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందది. అక్కినేని నాగచైతన్య, నాగార్జున మనం ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు నాగ వంశీ సితార బ్యానర్ మీద సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ టీజర్ ఈ రోజు అక్కినేని అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. “ప్రేమ కంటే యుద్ధం ఎక్కువ హింసాత్మకం కాదు” అంటూ పేర్కొన్న ప్రీ-లుక్ ముందుగానే రిలీజ్ చేయడంతో ప్రేక్షకులలో ఒక రకమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రిలీజ్ చేసిన గ్లిమ్స్ చూస్తుంటే, ఈసారి అయ్యగారు హిట్ కొట్టేటట్లుగానే కనిపిస్తున్నాడు. అఖిల్ లుక్ అయితే అదిరింది.. ఇప్పటివరకు సాఫ్ట్ క్యారెక్టర్స్ లో కనిపించిన అఖిల్ తన జోన్ లో నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది.

Exit mobile version