Akira Nandan: అకిరా నందన్ ఎంట్రీపై పవన్ కీలక వ్యాఖ్యలు

Akiranandan

Akiranandan

పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ హీరో అవుతాడా లేక మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడా? ఒకవేళ హీరో అయితే అతన్ని ఎవరు లాంచ్ చేస్తారు? ఎవరి దర్శకత్వంలో అతను మొదటి సినిమా చేస్తాడు? అనే చర్చ ఇప్పటిది కాదు. సోషల్ మీడియాలో అకిరా నందన్ కటౌట్ చూసినప్పుడల్లా ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే, అతనిపై పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఎలా ఉంది అనే విషయాన్ని తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ వెల్లడించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా రూపొందింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, హరీష్ శంకర్ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

Also Read:Hansika: ట్విస్టులు, టర్నులు.. సినిమాలకి మించి హన్సిక లవ్ స్టోరీ

ఈ క్రమంలోనే అకిరా నందన్ గురించి ప్రస్తావన రాగా, హరీష్ శంకర్ ఆసక్తికరంగా స్పందించారు. తాను కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ఒకటి రెండుసార్లు “బాబుని ఇలా లాంచ్ చేయాలి, అలా లాంచ్ చేయాలి” అని అన్నానని, కానీ దానికి పవన్ కళ్యాణ్ ఎగ్జైట్ అవ్వలేదని చెప్పుకొచ్చారు. అంతేకాక, “అతనికి ఏం చేయాలనిపిస్తే అది చేయనిస్తాను” అని పవన్ చెప్పినట్లు హరీష్ శంకర్ తెలిపారు. అంటే, ఇప్పుడు అకిరా నందన్ కు హీరో అవ్వాలని అనిపిస్తే మాత్రమే అతను హీరో అవుతాడు. ఫ్యాన్స్ కోసమో లేక తండ్రి కోసమో అతను హీరో అవ్వడం అనేది, పవన్ కళ్యాణ్ మాటలను బట్టి అసాధ్యమని చెప్పాలి.