Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని వెండితెరపై కనిపించి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ‘ఏజెంట్’ తర్వాత ఆయన నుంచి మరో సినిమా రాకపోవడంతో అభిమానులు ఆయన సిల్వర్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను బాగా మిస్ అవుతున్నారు. ఈ క్రమంలో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడటం హాట్ టాపిక్ గా మారింది.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ‘లెనిన్’ మే 1న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ పోటీలో ఉండటంతో చిత్ర యూనిట్ వెనక్కి తగ్గింది. బాక్సాఫీస్ వద్ద అనవసరమైన క్లాష్ వద్దు అనుకున్న మేకర్స్ ‘లెనిన్’ విడుదలను మే 1 నుండి జూన్ 26కి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాస్తవానికి ఏప్రిల్ 30న రావాల్సిన ‘పెద్ది’ సినిమా ఆ తేదీ నుండి తప్పుకుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ‘పెద్ది’ జూన్ 25న వస్తుంటే‘లెనిన్’ మరుసటి రోజే అంటే జూన్ 26న విడుదల కాబోతోంది. అంటే మే నెలలో తప్పుకున్న ఈ పోటీ మళ్ళీ జూన్ నెలాఖరున బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమైంది. కానీ వినిపిస్తున్నటాక్ ప్రకారం జూన్ 26న కూడా లెనిన్ రిలీజ్ వాయిదా వేసే అవకాశం ఎక్కువ ఉందట. మూడేళ్ల నిరీక్షణ తర్వాత అఖిల్ ఈ సినిమాతో గట్టి కమ్‌బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే ఇలా వాయిదాల మీదా వాయిదాలు వేయడంతో అక్కినేని అభిమానులు డీలా పడుతున్నారు.
Also Read
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
- Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
- APFDC: సినిమా షూటింగ్స్‌కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్‌గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరణ..
-
Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!