Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!

Akhil Akkineni (2)

Akhil Akkineni (2)

 అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవల విడుదలైన రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin) చిత్రంతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి అఖిల్ కెరీర్ లోనే తొలి సాలిడ్ హిట్‌గా నిలిచింది. దీంతో అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపినట్లయింది. ఈ విజయంతో అదే ఉత్సాహంతో ఉన్న అఖిల్, ఇకపై ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా జెట్ స్పీడ్ లో సినిమాలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై వస్తున్న ఈ ప్రచారాలపై అఖిల్ టీమ్ స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. “అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రాన్ని ఇంకా అధికారికంగా సంతకం చేయలేదు. దీనికి సంబంధించి ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని అందరినీ కోరుతున్నాం. ఆయన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుంది” అని ఆ నోట్‌లో స్పష్టం చేశారు. ఏది ఏమైనా ‘లెనిన్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అఖిల్, తన నెక్స్ట్ మూవీని మరింత జాగ్రత్తగా, ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏ క్షణంలో రానుందో అని అక్కినేని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు!