Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవల విడుదలైన రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin) చిత్రంతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి అఖిల్ కెరీర్ లోనే తొలి సాలిడ్ హిట్‌గా నిలిచింది. దీంతో అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపినట్లయింది. ఈ విజయంతో అదే ఉత్సాహంతో ఉన్న అఖిల్, ఇకపై ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా జెట్ స్పీడ్ లో సినిమాలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై వస్తున్న ఈ ప్రచారాలపై అఖిల్ టీమ్ స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. “అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రాన్ని ఇంకా అధికారికంగా సంతకం చేయలేదు. దీనికి సంబంధించి ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని అందరినీ కోరుతున్నాం. ఆయన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుంది” అని ఆ నోట్లో స్పష్టం చేశారు. ఏది ఏమైనా ‘లెనిన్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అఖిల్, తన నెక్స్ట్ మూవీని మరింత జాగ్రత్తగా, ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏ క్షణంలో రానుందో అని అక్కినేని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు!
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!