Site icon NTV Telugu

Akhanda 2: అఖండ క్రేజ్.. ఓటీటీ, శాటిలైట్ హక్కులతోనే 90% రికవరీ?

Akhanda 2

Akhanda 2

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2’. తొలి భాగం ‘అఖండ’ సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బడ్జెట్ డబుల్, ట్రిపుల్ స్థాయిలో పెరిగిందని, దాదాపు 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ భారీ బడ్జెట్‌లో 80-90 శాతం మొత్తాన్ని సినిమా విడుదల కాకముందే నాన్-థియేట్రికల్ రైట్స్ (ఓటీటీ, శాటిలైట్ హక్కులు) ద్వారా రికవరీ చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read :Chiranjeevi: చిరు సినిమా కథ లీక్ చేసిన ‘మీసాల పిల్ల’

‘అఖండ 2’ సినిమాకు సంబంధించిన ఓటీటీ, శాటిలైట్ హక్కుల కోసం భారీ డీల్ కుదిరినట్టు సమాచారం. ఈ హక్కులు ఏకంగా 145 కోట్లకు అమ్ముడైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓటీటీ రైట్స్: సుమారు 85 కోట్లు, శాటిలైట్ రైట్స్: సుమారు 60 కోట్లు మొత్తం: 145 కోట్లు. ఈ అంచనా నిజమైతే, దాదాపుగా సినిమా బడ్జెట్‌ను ఈ హక్కుల ద్వారానే మేకర్స్ రాబట్టినట్లవుతుంది.

Also Read :Vishnu Manchu: దీపావళికి టీవీలో ‘కన్నప్ప’

థియేట్రికల్ హక్కులతో లాభమే
నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇంత భారీ మొత్తాన్ని రికవరీ చేయడం వల్ల, ‘అఖండ 2’ థియేట్రికల్ రైట్స్‌తో వచ్చే మొత్తం నికర లాభంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. బాలకృష్ణ కెరీర్‌లో ఇప్పటివరకు 100 కోట్ల బిజినెస్ లేదా వసూళ్లు సాధించిన సినిమా లేదు. అయితే, ‘అఖండ 2’ బిజినెస్ 120 కోట్లు వరకు ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాతో బాలకృష్ణ ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్‌లో చేరతాడా లేదా అనేది థియేట్రికల్ హక్కుల అమ్మకాలు, వసూళ్లపై ఆధారపడి ఉంటుంది. ‘అఖండ 2’ థియేట్రికల్ రైట్స్ ఎంత మొత్తానికి అమ్ముడయ్యాయనే వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Exit mobile version