Akhanda 2: అఖండ క్రేజ్.. ఓటీటీ, శాటిలైట్ హక్కులతోనే 90% రికవరీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2’. తొలి భాగం ‘అఖండ’ సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బడ్జెట్ డబుల్, ట్రిపుల్ స్థాయిలో పెరిగిందని, దాదాపు 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ భారీ బడ్జెట్లో 80-90 శాతం మొత్తాన్ని సినిమా విడుదల కాకముందే నాన్-థియేట్రికల్ రైట్స్ (ఓటీటీ, శాటిలైట్ హక్కులు) ద్వారా రికవరీ చేసినట్లుగా తెలుస్తోంది.
Also Read :Chiranjeevi: చిరు సినిమా కథ లీక్ చేసిన ‘మీసాల పిల్ల’
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
‘అఖండ 2’ సినిమాకు సంబంధించిన ఓటీటీ, శాటిలైట్ హక్కుల కోసం భారీ డీల్ కుదిరినట్టు సమాచారం. ఈ హక్కులు ఏకంగా 145 కోట్లకు అమ్ముడైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓటీటీ రైట్స్: సుమారు 85 కోట్లు, శాటిలైట్ రైట్స్: సుమారు 60 కోట్లు మొత్తం: 145 కోట్లు. ఈ అంచనా నిజమైతే, దాదాపుగా సినిమా బడ్జెట్‌ను ఈ హక్కుల ద్వారానే మేకర్స్ రాబట్టినట్లవుతుంది.
Also Read :Vishnu Manchu: దీపావళికి టీవీలో ‘కన్నప్ప’
థియేట్రికల్ హక్కులతో లాభమే
నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇంత భారీ మొత్తాన్ని రికవరీ చేయడం వల్ల, ‘అఖండ 2’ థియేట్రికల్ రైట్స్‌తో వచ్చే మొత్తం నికర లాభంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. బాలకృష్ణ కెరీర్లో ఇప్పటివరకు 100 కోట్ల బిజినెస్ లేదా వసూళ్లు సాధించిన సినిమా లేదు. అయితే, ‘అఖండ 2’ బిజినెస్ 120 కోట్లు వరకు ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాతో బాలకృష్ణ ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లో చేరతాడా లేదా అనేది థియేట్రికల్ హక్కుల అమ్మకాలు, వసూళ్లపై ఆధారపడి ఉంటుంది. ‘అఖండ 2’ థియేట్రికల్ రైట్స్ ఎంత మొత్తానికి అమ్ముడయ్యాయనే వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!