అఖండ 2 నేడు వరల్డ్ వైడ్ గా ఈ రోజు విడుదల కావాల్సి ఉండగా ఫైనాన్స్ ఇష్యుతో వాయిదా పడింది. గత రాత్రి ప్రీమియర్స్ కోసం బుకింగ్స్ చేసిన వారికీ టికెట్ డబ్బులు రిఫండ్ కూడా చేసేసారు. అసలు ఈ సినిమా ఎప్పడు రిలీజ్ అవుతుందనే దానిపై మేకర్స్ నుండి ఎటువంటి క్లారిటీ రాలేదు. అఖండ 2 మేకర్స్ 14 రీల్స్ ప్లస్ రామ్ ఆచంట, గోపి ఆచంటపై Eros International Media Limited మద్రాస్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేయాలని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Also Read : Tollywood : మహేశ్ బాబు, JrNTR సినిమాలు రిలీజ్ రోజు వాయిదా పడిన సంగతి తెలుసా.?
అసలు వివాదం ఏంటంటే 2019 జూలై 23 న 14 ఫిలిమ్స్ ప్లస్ మేకర్స్ బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యూరోస్ నుండి దగ్గర నుండి రూ. 27Cr రూపాయలు రుణం తీసుకున్నారు. అవి తిరిగి చెల్లించకుండా మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే, ఆగడు సినిమాలకు వారిని బాగాసౌమ్యంగా కూడా చేర్చారు. ఆ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దాంతో 14 రీల్స్ తో సినిమాలు చేయడం ఆపేసింది ఈరోస్. అయితే ముందు తీసుకున్న రూ. 27 కోట్ల ఋణం అలాగే ఉంది. అప్పటి నుండి పెండింగ్ లో ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు అఖండ 2 రిలీజ్ కు అడ్డంకిగా మారింది. రుణంగా తీసుకున్న అసలుకు నిమిత్తం 14% వడ్డీగా నిర్ణయించి ఇప్పుడు టోటల్ రూ. 51 కోట్లు అయిందట. కోర్టులో 50 శాతం కట్టి మిగిలిన మొత్తానికి చెక్కుల రూపంగా డేట్లు వేసి ఇమ్మని కోరుతున్నారు. ఈ విషయమై కోర్టు లో వాదనలు జరుగుతుంది.
