Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’

Akash Goparaju

Akash Goparaju

‘సర్కారు నౌకరి’ చిత్రంతో హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సింగర్ సునీత కొడుకు, యంగ్ హీరో ఆకాష్ గోపరాజు.. ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ ఎంతో ప్యాషన్‌తో నిర్మించిన చిత్రం ‘కొత్త మలుపు’. జూన్ 12న విడుదల కాబోతున్న ఈ పల్లెటూరి రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రమోషన్స్ లో భాగంగా హీరో ఆకాష్ ఇండస్ట్రీ ఇంటర్నల్ మ్యాటర్స్ మరియు సినిమా హైలైట్స్‌ను పంచుకున్నారు.

తన మొదటి సినిమాతో పోలిస్తే ఈ చిత్రం ఎంత భిన్నంగా ఉండబోతుందో ఆకాష్ చెబుతూ “నా ఫస్ట్ మూవీ ‘సర్కారు నౌకరి’ ఒక ప్యూర్ పీరియడ్ డ్రామా. కానీ ‘కొత్త మలుపు’ కంప్లీట్ డిఫరెంట్ జానర్. ఇది కోనసీమ పల్లెటూరి అందాల నేపథ్యంలో సాగే లవ్, కామెడీ, ఎమోషన్స్ అండ్ మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్. కథ విన్నప్పుడే ఇందులోని ట్విస్టులు నన్ను బాగా ఎక్సైట్ చేశాయి. ఈ చిత్రానికి ప్రముఖ సీనియర్ డైరెక్టర్ ఏ. కోదండరామిరెడ్డి గారు ఈ టైటిల్‌ను సజెస్ట్ చేశారు. పేరుకు తగ్గట్టే సెకండ్ హాఫ్‌లో వచ్చే మలుపులను ప్రేక్షకులు అస్సలు ఊహించలేరు” అని ధీమా వ్యక్తం చేశారు. సినిమాలోని లవ్ ట్రాక్ గురించి చెబుతూ.. “ఈ సినిమాలో నేను, హీరోయిన్ భైరవి అర్ధ్యా బావ-మరదళ్లుగా కనిపిస్తాం. పల్లెటూరి వాతావరణంలో మా ఇద్దరి మధ్య వచ్చే ప్రేమ, సరదా గొడవలు, ఫన్నీ సీన్స్ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. స్క్రీన్ పై మా జోడీ చాలా ఫ్రెష్‌గా ఉంటుందని డైరెక్టర్ గారు కూడా చెప్పారు. ఇక నా క్యారెక్టర్ విషయానికొస్తే.. నేటి తరం యువత ఆలోచనలకు అద్దం పట్టేలా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది” అని ఆకాష్ పేర్కొన్నారు.

×
×
Ad

సింగర్ సునీత సపోర్ట్ గురించి ఆకాష్ ఎమోషనల్ అయ్యారు. “అమ్మ ఆల్రెడీ సినిమా చూసింది. అవుట్‌పుట్ చూసి చాలా హ్యాపీగా ఫీలయింది. ఆడియన్స్‌కు కచ్చితంగా నచ్చుతుందని బూస్టప్ ఇచ్చింది. కెరీర్ లో కథల ఎంపిక విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూనే.. వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తోంది. ఈ ప్రమోషన్స్ లోనూ అమ్మ సపోర్ట్ మరువలేనిది” అన్నారు. టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో, మైత్రి డిస్ట్రిబ్యూషన్ అండతో జూన్ 12న రాబోతున్న ఈ ‘కొత్త మలుపు’ ఆకాష్ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి!