Site icon NTV Telugu

Chennai: కరూర్ తొక్కిసలాటపై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

Untitled Design (5)

Untitled Design (5)

తమిళనాడులో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్.. కరూర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట విషాదాంతంగా మిగిలిన సంగతి తెలిసిందే. అయితే కరూర్ తొక్కిసలాట ఘటనపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కొల్పోవడం, గాయపడడం తనను ఎంతగానో కలిచి వేసిందని అన్నారు. అటువంటి సంఘటనలకు దారితీసిన విస్తృత సామాజిక సమస్యలపై ప్రస్తావించారు. అభిమానులు, మీడియాతో సహా అన్ని వర్గాల నుండి ఆత్మపరిశీలన చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Read Also: LPG: తగ్గిన గ్యాస్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి…

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్(Vijay) ఇటీవల జనాలతో మాట్లాడేందుకు కరూర్‌లో ఓ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ర్యాలీలో జనం అధికంగా రావడంతో తొక్కిసలాట జరిగి 41మంతి ప్రాణాలు కోల్పోగా.. ఎంతోమందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనపై హీరో అజిత్ స్పందించారు. తాను ఎవరినీ అణగదొక్కడానికి ప్రయత్నించడం లేదు. కానీ తాను చెప్పినట్లుగా ఈ తొక్కిసలాట కారణంగా ఈ రోజు తమిళనాడులో చాలా జరుగుతున్నాయన్నారు. దీనికి విజయ్ మాత్రమే బాధ్యత వహించడు. మనమందరం దీనికి బాధ్యులం. మీడియా కూడా ఇందులో పాత్ర పోషించాలని ఆయన అన్నారు.

Read Also:Swara Bhaskar: చిన్న నాటి క్రష్ గురించి చెప్పిన బాలీవుడ్ బ్యూటీ…

“ఇలాంటి గందరగోళం ప్రధానంగా సినిమా తారల చుట్టూ ఎందుకు జరుగుతుందని అజిత్ ప్రశ్నించాడు, ” నా ఉద్దేశ్యం మీకు క్రికెట్ మ్యాచ్ కోసం వెళ్ళే జనం ఉన్నారు, అక్కడ ఇదంతా జరగడం మీరు చూడరు కదా? థియేటర్లలో మాత్రమే ఎందుకు జరుగుతోంది? సెలబ్రిటీలు, సినీ ప్రముఖుల విషయంలో మాత్రమే ఎందుకు జరుగుతోంది? మరి, ఏమి జరుగుతుంది? ఇది ప్రపంచవ్యాప్తంగా మొత్తం సినిమా పరిశ్రమను చెడుగా చూపిస్తందన్నారు. ఇలాంటి ఘటనలు జరగాలని మనమెవవ్వరము కోరుకోమని ఆయన అన్నారు.

Exit mobile version