టీవీకే అధినేత, నటుడు విజయ్ మరోసారి తమిళనాడులో భారీ ర్యాలీకి సిద్ధమయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత రాష్ట్రంలో తొలిసారి భారీ ర్యాలీ చేపడుతున్నారు. గురువారం ఈరోడ్ జిల్లాలోని విజయమంగళం టోల్ గేట్ దగ్గర ప్రజలను ఉద్దేశించి విజయ్ ప్రసంగించనున్నారు.
పుదుచ్చేరి కేంద్రంగా టీవీకే అధినేత, నటుడు విజయ్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట తర్వాత తొలిసారి పబ్లిక్ మీటింగ్‌లోకి వస్తున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తమిళనాడులో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్.. కరూర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట విషాదాంతంగా మిగిలిన సంగతి తెలిసిందే. అయితే కరూర్ తొక్కిసలాట ఘటనపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కొల్పోవడం, గాయపడడం తనను ఎంతగానో కలిచి వేసిందని అన్నారు. అటువంటి సంఘటనలకు దారితీసిన విస్తృత సామాజిక సమస్యలపై ప్రస్తావించారు. అభిమానులు, మీడియాతో సహా అన్ని వర్గాల నుండి ఆత్మపరిశీలన చేసుకోవాలని పిలుపునిచ్చారు.…