వనతి శ్రీనివాసన్ ను ప్రశ్నిస్తున్న అజిత్ ఫ్యాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వనతి శ్రీనివాసన్… ఇప్పుడు తమిళనాడులో బాగా వినిపిస్తున్న పేరు. లోక నాయకుడు కమల్ హాసన్ ను ఓడించిన బీజేపీ అభ్యర్థి ఆమె! కోయంబత్తూర్ సౌత్ నుండి పోటీ చేసిన కమల్ ఓడిపోవడమే కాకుండా, అతని ఎం.ఎన్.ఎమ్. పార్టీ నుండి పోటీ చేసిన మరే అభ్యర్థీ తమిళనాట విజయం సాధించలేదు. విశేషం ఏమంటే… అన్నాడీఎంకే సహకారంతో బరిలోకి దిగిన వనతి శ్రీనివాసన్ ఎన్నికల ప్రచార వేళ అజిత్ ఫ్యాన్స్ కు ఓ హామీ ఇచ్చిందట. అజిత్ ఫ్యాన్స్ తనకు ఓటు వేస్తే… అతని తాజా చిత్రం ‘వాలిమై’కు సంబంధించిన అప్ డేట్స్ ఇచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పిందట. తమిళనాడు మాజీ సీయం, స్వర్గీయ జయలలిత అంటే అజిత్ కు ఎంతో అభిమానం. అలానే అతని ఫ్యాన్స్ లోనూ చాలా మంది జయలలిత అభిమానులు ఉన్నారు. వారంత ఇప్పుడు బీజేపీ నుండి బరిలో దిగిన వనతి శ్రీనివాసన్ కే ఓటు వేసి ఉంటారు. ఆమె ఎన్నికల్లో గెలిచీ గెలవగానే ప్రధాని నరేంద్రమోదీకి, అమిత్ షాకు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ కూ, కార్యకర్తలకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపింది. ఇదే అదనుగా ఆ ట్వీట్టర్ కిందే అజిత్ అభిమానులంతా… ఆమెకు అభినందనలు తెలియచేస్తూనే, ఆమె తమకు ఇచ్చిన హామీ గురించి ప్రశ్నిస్తున్నారు. ‘అక్కా… మా అజిత్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇస్తానన్నావు… ఆ విషయం ఏమైంది?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాదు.. మీమ్స్ తో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు కూడా! మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వనతి శ్రీనివాసన్… అజిత్ తో మాట్లాడి ‘వాలిమై’కు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ ఇస్తుందేమో చూడాలి!!
Also Read
- Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
- PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్‌లోకి మీకూ ఎంట్రీ!
- Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా 'అంబ’s రివెంజ్'
- Kalki Sequel: 'కల్కి 2' నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
తాజావార్తలు
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్‌లోకి మీకూ ఎంట్రీ!
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!