Site icon NTV Telugu

Ajith Kumar: హాస్పిటల్ లో అడ్మిటయిన అజిత్?

Valimai Update: double surprise for Thala Ajith fans

తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అజిత్ కుమార్, నటనతో పాటు కార్ రేసింగ్‌లోనూ తన ప్రతిభను చాటుతున్నారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన కార్ రేస్‌లో విజయం సాధించి భారతదేశానికి గర్వకారణమయ్యారు. ఆ సంగతి ఆలా ఉంచితే ఆయన నటన రంగంలో చేసిన అద్భుత కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ అవార్డు లభించింది.

Read More : Nani: ‘HIT 3’ వైలెన్స్ ఎంజాయబుల్‌.. బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం

ఈ సందర్భంగా, ఏప్రిల్ 28న ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో అజిత్ కుమార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరైన అజిత్, అందరి ప్రశంసలు అందుకున్నారు. అవార్డు వేడుక తర్వాత, ఏప్రిల్ 29న అజిత్ కుమార్ తన కుటుంబంతో ఢిల్లీ నుంచి చెన్నైకి తిరిగి వచ్చారు. అయితే, చెన్నైకి చేరుకున్న వెంటనే ఆయన చెన్నైలోని గ్రీమ్స్ రోడ్‌లో ఉన్న అపోలో ఆసుపత్రిలో చేరారు.

Read More : CM Revanth Reddy: తెలంగాణ నిర్ణయాన్ని దేశం అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉంది..!

విమానాశ్రయంలో అభిమానుల జనసమూహంలో జరిగిన ఓ చిన్న గొడవ కారణంగా ఆయన కాలికి స్వల్ప గాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి, మరియు ఫిజియోథెరపీ చికిత్స కూడా అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, అజిత్ కుమార్ మే 1న తన 54వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Exit mobile version