Site icon NTV Telugu

Air India Plane Crash: కన్నప్ప నార్త్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాన్సిల్

Kannappa

Kannappa

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో గుజరాత్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో వందలాది మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఫ్లైట్ లో ఉన్న వారే కాదు ఫ్లైట్ జనావాసాల మీద పడడంతో భూమి మీద ఉన్న ప్రాణం ఇష్టం కూడా ఎక్కువగానే కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.

Also Read :Air India Plane Crash: విమానంలో భారతీయులే ఎక్కువ.. విదేశీయులు ఎంతమందంటే?

ఇక తాజాగా ఈ ఘటన కారణంగా రేపు జరగాల్సిన మంచు విష్ణు కన్నప్ప సినిమా నార్త్ ట్రైలర్ లాంచ్ అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. నిజానికి షెడ్యూల్ ప్రకారం రేపు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణంలో ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు. అన్ని భాషల మీడియా ప్రతినిధులను అక్కడికి ఆహ్వానించారు. తెలుగు మీడియా ప్రతినిధులు కూడా రేపు ఉదయాన్నే ఫ్లైట్లో వెళ్లాల్సి ఉంది.

Also Read : Akhanda 2: బాలయ్య సినిమాకి 80 కోట్ల ఓటీటీ డీల్!

అయితే తాజాగా జరిగిన ఫ్లైట్ ప్రమాదం నేపథ్యంలో వారికి నివాళులు అర్పిస్తూ వారికి సంతాపంగా రేపు జరగాల్సిన ఈవెంట్ ని ఒకరోజు వాయిదా వేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. ఈ కఠినమైన సమయంలో వారి కుటుంబాలకు తన ప్రార్ధనలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాని ముఖేష్ సింగ్ డైరెక్ట్ చేశారు ఈ సినిమా ఎన్నో వాయిదాల అనంతరం ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Exit mobile version